పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధునికథ.

247

ఆవిద్య తెలిసికొని వాఁడు మిగులసంతోషించుచు మృగములన్నియు వశవర్తులై సంచరించుచుండ నిర్భయముగా నాపర్ణశాలయందు సిద్ధునిప్రక్కవసించి ముక్కు మూసికొని యేదియో జపించుచున్నట్లు నటించుచుఁ గొన్నిదినములు వెళ్ళించెను.

సిద్ధునకు వానియందు మంచిదయ కలిగినది. చనువుగలిగినపిమ్మట భైరవుం డొకనాఁడు సిద్ధునితో నార్యా ! మీవంటితపశ్శాలులకుఁ గాంచనము చేయుప్రజ్ఞ గలిగియుండునని చెప్పుదు రదియెంతనిజము ? అని యడిగిన నతండు ఆయోగము నాకుఁ దెలియును. కాని దానితో మాకేమిప్రయోజనమున్నది? లోష్టము కాంచనము సమముగాఁ జూచువారముకాదా? అని చెప్పిన వాఁడు చేతులు నలుపుచు స్వామీ ! దానితో నాకునుం బనిలేదు. కాని అది యెట్లగునో చూడవలయునని యభిలాషయున్నది. నూత్నవిద్యాభిలాషుఁడ నగు నే నాయోగ ముపదేశము గావింపవలయునని సాహసించి యడుగుచున్నాను. మీకుఁ బుత్రతుల్యుండనగుట నిట్టిమాట కోరితిని. అని యభిప్రాయము సూచించిన నయ్యతి ఓయీ ! అహంకారమమకారగ్రస్థు లావిద్య స్వీకరింప నర్హులుకారు. స్వార్థపరుల కది చెప్పరాదు. నీబుద్ధివిశేషము గ్రహించి ముందు నీకా విద్య నుపదేశించెదనులే! అని సమాధానము చెప్పెను వాఁడును చిత్తము. చిత్తము. అని వినయ మభినయించుచు మఱికొన్నిదినము లరిగిన వెనుక మఱియొకసారి యాప్రస్తావము దెచ్చెను.

ఆమాటలలో వానిస్వార్థపరత్వము గ్రహించి కొంతకాల మరిగినంగాని యుపదేశింపనని సూచించెను. అప్పుడప్పు డడుగుచుండ నీమనసు పరిపక్వమునొందినట్లు లేదు. నిష్కామునకుఁగాని యధి యుపదేశింపరాదు. విరక్తుండవై యడుగుమని పలుకుచుండును.

ఒకనాఁడు మధ్యాహ్నసమయంబున సిద్ధుండు భైరవయుక్తుండై తటాకంబున స్నానముచేయుచున్న సమయంబున నొక బ్రాహ్మణకుమా