పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యు దూరముగాఁబోయెనని నమ్మకము గలిగినపిమ్మట భైరవుఁడు మెల్లగా నాచెట్టుదిగి యొంటిప్రాణముతో నొకదారింబడి నడువసాగెను. ఏచెట్టుపైఁ బిట్ట పుఱ్ఱుమన్నను నేదియోమృగము మీఁదఁబడునని వెఱపుగదురఁ బరుగిడుచుండును. అట్లు వాఁ డమ్మహారణ్యమధ్యంబున నత్యంత సాధ్వసభ్రమితస్వాంతుండై తిరుగుచు నొకనాఁడు సాయంకాలంబునకు దైవికముగా సిద్ధకూటంబునకుఁ బోయి యందొకవృక్షాంతరంబున వసించి యాఱేయి వేగించెను.

−♦ సిద్ధునికథ. ♦−

సూర్యోదయసమయంబున నతని కొకఘుంటానాదంబు వినంబడుటయు నక్క జముతో నోహో ! యిందు మనుష్యులుండిరా యేమి ? లేనిచో నీధ్వని యెట్లుబయలువెడలెడిని? నా కాయుశ్శేష మింకనుం గలదుకాఁబోలు. అని తలంచుచు నారవంబు బయలువెడలుచున్న దెసకుఁ జూడ్కులు వ్యాపింపఁజేసెను. అల్లంతదూరములో శాఖా సమావృతదిక్తటంబగు వటవిటపియొండు కన్నులపండువు గావించినది.

దానిపొంత నిరంతరలతాంతమనోహరలతాంతర పరిశోభితంబగు పర్ణశాల విశాలమాలతీవేల్లితంబై యొప్పుచుండెను. తదంతికంబున శాఖాతంబున వ్రేలంగట్టినఘంటిక నొకభల్లూకంబు గొట్టుచుండెను. ఆవింతజూచి భైరవుండు గడగడ వడంకుచు నయ్యో ! మఱల నామృగంబులన్నియు నిందు వచ్చునుగాఁబోలు. నాఁడు రాత్రియగుటఁ జూడక విడిచినవి. నేఁడు చంపును. అదిగో మృగములరొద వినంబడుచున్నది. ఈయెలుఁగుబంటి యీగంట నెందుసంపాదించినదో అని యాలోచించుచు డిల్లవడి యాదెస చూచుచుండె నప్పుడు,

సీ. సమ్మార్జనము చేసెఁ జమరీమృగంబులు
                   చలితవాలప్రభంజనముచేతఁ