పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిర్యగ్జంతుమహాసభ.

241

పుఁడు అని పలుకుచుఁ. బిల్లు లోరసిల్లినవి.

అప్పుడు శార్దూలంబులు వాలంబులు త్రిప్పుచు గంభీరస్వరంబున నిట్లుపలికినవి. మహారాజా ! కుక్కలుఁ బల్లులుందక్క తక్కిన గ్రామ్యమృగంబులన్నియు మనుష్యులపై ద్వేషించుట కంగీకరించినవి. తదుచ్ఛిష్ఠభోక్తలగునవి యట్లుపలుకుట వింతగాదు. వానితో మనకంత పనిలేదు. వృషభాశ్వములు వారినివిడిచి మనలోఁ గలియుట కంగీకరించినవిగదా. ఎడ్లు భూమిదున్నకున్న నడవి బలియును. అరణ్యావృతములగు గ్రామములసమీపముల మన మేగవచ్చును. అప్పుడు మనము మనుష్యుల జయించుట సులభమని పెద్దపులులు పలికినవిని యితరమృగంబులన్నియు నామాట కంగీకరించినవి.

అప్పుడు అగ్రాసనాధిపత్యము వహించియున్న సింహము నిలువంబడి వినుండు. వినుండు. తొందరవలదు. మనుష్యులు కడునేర్పరులు బుద్ధిబలముగలవారు వారిం బరాజితులఁగావించుట సామాన్యముకాదు. మనలో నైకమత్య మింకనుం గలుగలేదు. అండజములు సరీసృపములు కీటకాదులు కూడ మనలోఁ జేరవలయును. అప్పుడుకాని మనమాపనికిఁ బ్రయత్నింపరాదు. మఱియొకసభకు వానింగూడ రప్పింతుము. ఇందుల కందఱు ననుమోదింపవలయునని సింహం బుపన్యసించినది. ఏకగ్రీవముగా నామాట కాసత్వంబు లంగీకరించినవి. ఆతీరుమానమునకు మార్జాల కుర్కురములు పరిహాసము గావించుచు లేచిపోయినవి. అంతలోఁ దెల్లవారుసమయమగుటయు నామృగంబులెల్లఁ దమతమ నెలవునకుఁ బోయినవి.

బైరవుం డాకోటరమున వసించి మృగసభావిశేషము లన్నియుం జూచుచుండెను. కాని వానిసంభాషణ మేమియుం దెలియలేదు. ఏమృగ మెప్పుడువచ్చి మీఁదఁబడిచంపునోయని యడలుచు నొంటిప్రాణముతో నాతొఱ్ఱనంటుకొని కూర్చుండెను. తెల్లవారినతరువాత మృగములన్ని