పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఖింపుచుఁ జెప్పికొనినవి. అప్పుడు వార్యక్షంబు శునకములఁజూచి మీయాశయమెఱింగింపుఁ డనవుడు శ్వానములు నిలువంబడి మ్రొక్కుచు నిట్లు చెప్పినవి.

దేవా ! మమ్ము అల్పులమని తలంపక మృగంబులతోఁగూడఁ బ్రాతినిధ్య మిప్పించి యీసభకు రప్పించినందులకు వందనశతంబు లర్పించుచున్నాము. మాకు మనుష్యులేమియు నపకారము సేయకున్నను జాతి సాధర్మ్యమున మీతోఁజేరకతీరదు. కాని యొండు వినుండు. మీకు మొగమాటపడి యెదనొండుబెట్టుకొని యొకటిచెప్పుట సభ్యుని ధర్మముగాదు. మేము మనుష్యులు తిను నాహారము భుజింతుము. వారిని విడిచి మేమడవికివత్తుమేని మాకాహారమేది ? క్రొత్తశాసనప్రకారము ఒకజంతు వొకజంతువును భక్షింపఁగూడదుగదా ? అన్నమైన మాంసమైన మాకుఁ గావలయును అడవిలో రెండును దొరకవు మనుష్యులపై మేమెట్లు ద్వేషింతుము? ఈగుఱ్ఱములు నెడ్లు గజంబులును నరుల పై వైరముసూచించి పలికినవికాని వారు పెట్టెడుతిండి యడవిలో వానికిఁ దొరకునా ? తమ పిల్లలవలెఁ జూచుకొని యాహారము పెట్టుచున్న మనుష్యులవిడిచి యడవికిఁబోవుట చెడుబుద్ధిగాని మంచిబుద్ధి గాదు. ఇట్లు పలికితిమని దేవర మాయందు వైరము బూనఁదగదు క్షమింపవలయునని శునకంబులు పలికినవి.

మార్జాలము లామాటలే యనువదించుచు మహాత్మా ! నరులగృహములలో సంచరించుటకుఁ గుక్కలకు నిషేధమున్నదికాని మా కేమియు నాటంకములేదు. మహారాజుల యంతఃపురములు సూతికా గృహములుగాఁ జేసికొందుము. మనుజులు భుజించివిడిచినపదార్థములన్ని యు మాపరములగును. గృహములలో స్వేచ్ఛగాఁ దిరుగుదుము వారి పాలు పెరుగు త్రాగుచుందుము వారిపైఁగత్తిగట్టి మీతో నడవికి వచ్చి మేమేమి చేయుదుము. మీకునమస్కారము క్షమింపుడు. క్షమిం