పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    జనుల నెక్కించి నడకున్నఁ జావమోదు
    నయ్యయో ! యేరులేరు మాకుయ్యవినఁగ.

క. ఇలను దనంతటనేపడి
   మొలచిన పచ్చికభుజించి మురువుగ బ్రతుకం
   గల మిట్టి మాకు మనుజుల
   కొలువేమిటికో యగమ్యగోచర మరయన్ !

అచ్చువేసి విడిచినయెద్దు లెట్లు బలియునో చూచితిరా? స్వేచ్ఛ దిరుగనిచ్చిన మేమెల్లరము నాలఁబోతులవలె బలిసియుందుముగదా. రాత్రింబగళ్లు మాచే బనులు గొనుచు మమ్ము మిక్కిలి బాధలుపెట్టుచున్న మనుష్యులఁ దప్పక శిక్షింపవలసినదేయని యెద్దులు పల్కినవి. దున్నలు నామాటలే పలికినవి. ఆవులును గేదెలును నందుల కనుమోదించినవి. పిమ్మట మేకలు నిలువంబడి మృగేంద్రమా ! మాకష్టము లిట్టివని చెప్పఁజాలము. పశుమృగపక్షికీటకాదులలో మావంటి మెత్తని జాతి మఱియొకటిలేదు. మాయునికి గ్రామమందైనను నాహార మారణ్యకము. మునులవలె నాకలములు దిని యెవ్వరికిని వెఱపుగలుగఁజేయక సాధువృత్తి మెలంగుచున్నను మమ్మందఱు బలవంతమున జంపుచుందురు. అక్కటా మనుష్యుల పండువులు మాకు గండములు. వారి యుత్సవములు మాకాపత్సమయములు. దొరలరాక మాకవసానసమయము. వారి మసూచికములు మాకు మరణసూచకములు. అయ్యయ్యో! మనుష్యుల కే కాక మెకాలకుఁగూడ మేమే లోకువ! అదియొకటేకాదు. మాంసమాసింపని వేలుపులుగూడ బులులవలె మావపఁ దిన నాసించుచుందురఁట ! ఇఁక మాకు సుకమెక్కడిది? రోగముల వలన మాకు మరణములేదు. బలవన్మరణమే మాకుశరణము. పుడమి నిర్మానుష్యము సేయించినచో మేము హాయిగా జీవింతుము. మీ దయవలన మెకములిఁక మాజోలికి రావుగదా ? మనుష్యులఁ బరిభవిం