పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిర్యగ్జంతుమహాసభ.

237

రికి లొంగవలసినపని లేదు. ఆరణ్యకములు మనుష్యులఁ బ్రేమింపవు. గ్రామ్యములు లొంగియుండి వారిం బ్రేమించుచున్నవి. కావున వారిపైఁ గత్తికట్టి సాధించుటకు గ్రామ్యమృగముల యభిప్రాయము తెలిసికొనవలసియున్నది. మీమీయభిప్రాయము లెఱింగింపుఁడని పలికి సింహము కూర్చున్నది. అప్పుడు బలీవర్ధంబులు నిలువంబడి యిట్లు చెప్పినవి.

అక్కటా ! మాయిక్క ట్లేమెకంబులకును లేవు. వినుండు.

సీ. బలము చేరుటకు మందలగట్టి పొలములఁ
                 బెంట దోలుదు మగ్గి ప్రేలుచుండ
    బదునురా భూమి దున్నుదు మెల్లసస్యముల్
                ఫలియింపఁ బలుమారు హలముఖమున
    వాడిడెక్కల ద్రొక్కి వరిగడ్డి విడిపోవ
                ధాన్యముల్ నూర్తు ముద్దామలీల
    నూర్చిన ధాన్య మానోగణంబులను గా
               దులకుఁ దోలికొనిపోదుము గదయ్య

గీ. ఇన్నిపాటులుపడి ఫలియింపఁజేయఁ
    జేరెడైనను ధాన్యంబు చేతితోడఁ
    దినఁగఁ బెట్టరు పనికిమాలినది గడ్డి,
    పొల్లు, దూగర, గాకయెప్పుడును జనులు.

అదియునుంగాక

ఉ. బండికిఁగట్టి మమ్ముఁ గడు భారమువైచి యొకండు ముందుఁ గూ
    ర్చుండి వడిన్వడింజన చొఛో యనుచుం జనకున్న వీపుపై
    ఛండకశాగ్రభాగమున భళ్ళునఁ గొట్టుచు విచ్చి రక్తపుం
    గండబయల్పడం గరుణ గాంచఁడు సీ! మనుజుండు సేవ్యుఁడే ?

గీ. ఎట్టినీరసపడినట్టి యెద్దునైన
    గట్టి యొంటెద్దుబండి కెక్కసముగాఁగ