పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భైరవునికథ.

235

ఖాంతరములనుండినఁ బరమేశ్వరుఁడు కనుంగొనలేడు. కోటరమునవసించి యిందలివింతలఁ జూచెదంగాక యని నిశ్చయించి యొకానొక తొఱ్ఱ శుభ్రముసేసికొని యందు వసించియుండెను. ఇంతలోఁ బ్రొద్దు గ్రుంకినది. అప్పుడు-

గీ. వెల్గురాయనిజోడు వెన్నెలలఱేఁడు
    పాలసంద్రంబుపట్టి చూపట్టె నుదయ
    మేదినీధరకూటగ్రసౌధసీమ
    నిజక రావళి దెసల వన్ని యల నిడుచు.

−♦తిర్యగ్జంతుమహాసభ ♦−

క్రమంబున వెండిపూసినట్లు పండువెన్నెలలు దెసల నిండియుండ సింహ శార్దూల వరాహ శాఖామృగ భల్లూక ప్రముఖములగు నారణ్యకమృగంబులును అజగజాశ్వమూషకశునకమార్జార ధేనువృషభ ప్రముఖములగు గ్రామ్యజంతువులును సందోహములుగా నాచెట్టుక్రిందకు రాఁదొడంగినవి. అందు ముందుగా జంబుకంబులు వచ్చి రాఁబోవు మృగంబుల కెదురుబోయి మృగంబులఁ దీసికొనివచ్చి యుచితస్థానంబులఁ గూర్చుండఁబెట్టుచుండెను. జాముప్రొద్దుపోవువఱకు నాప్రదేశమంతయు మృగములచే నిండింపఁబడియున్నది.

గీ. తోఁక యాడించుకొనుచు నస్తోకవేగ
    మడరఁ గేసరములు వాయుహతిఁ జలింప
    వచ్చె హర్యక్ష మొకటి లేవఁగ మృగంబు
    లెల్ల వలదంచు సంజ్ఞ గావించి యటకు.

అట్లువచ్చి యమ్మృగేంద్రంబు దనకై యమరింపఁబడియున్న పెద్ద గద్దియం గూర్చున్నది. అప్పుడు మృగంబులెల్ల సంతోషారావంబులు వెలయించుటయు నభినందించుచు జంబుకంబులు నిలువంబడి మహాత్మా ! భూమండలంబంతయు దిరిగి గ్రామ్యమృగంబులకు నారణ్యకమృగంబు