పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    యొకమాటు రసవాదయుక్తులఁ బన్ను సం
                  తల కేగి యందు జూదంబులాడు

గీ. మూటలను మోయుఁ గూలికి బాటగొట్టు
    మృత్యువై పాంథులకు నిట్లు మెలఁగి మెలఁగి
    యేదినంబున కాదినంబే యతండు
    కళవళము జెందుఁ గూడుగుడ్డలును లేక.

గీ. దేవళంబులలోపలి దీప మార్చి
    భారతము నెత్తిబూని యబద్ధమాడుఁ
    జేత నొక కాసు వెట్టినఁ జిచ్చువెట్టుఁ
    దలఁకఁ డించుక బ్రహ్మహత్యకును వాఁడు.

ఆపాపాత్ముం డెట్టిపాపకృత్యములు సేయుచున్నను నిప్పచ్చరము వదలినదికాదు. వాఁడు మ్రుచ్చులంగూడుకొని విచ్చలవిడి చౌర్యక్రియాదక్షుండై క్రుమ్మరుచుండ రాజభటులు వానింబట్టుకొని చెఱసాలం బెట్టిరి.

ఎట్లో తప్పించుకొని పారిపోయి గ్రామములు విడిచి తలపెంచుకొని మహారణ్యసంచారము గావింపుచు నొకనాఁ డొకకాంతారాంతరమునఁ బొద్దుగ్రుంకుచుండ నాఁటిరాత్రి నివసింపందగిన నెల వేదియని యాలోచింపుచుండ దీర్ఘశాఖలచే దెసలనావరించియున్న యొకవృక్షం బాసమక్షమునఁ దన్ను రక్షింపఁ బ్రత్యక్షంబైన భగవంతుఁడోయనఁ గన్పట్టినది. విశాలంబగు తదంతికభూతలంబంతయుఁ దృణకంటకాదులు లేకుండ బాగుచేయఁబడియున్నది. అందందు మెత్తనిపల్లవములు పుష్పములు దళములు విష్టరములుగాఁ బరువఁబడియున్నవి. ఆవింత జూచి భైరవుం డయ్యా రే ! ఇది మనుష్యులు సంచరించు ప్రదేశంబని తోఁచుచున్నది. ఈచెట్టుక్రిందకు వచ్చి గొప్పవారు రాత్రులఁ జల్లగాలి సేవింపు చుందురుకాఁబోలు. ఏదియెట్లైన దీనిక్రింద వసించుట నీతికాదు. దీనిశా