పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదయంతికథ.

231

అని యోదార్చినది. కొలఁదిదినములకే యాకలికి యథాప్రకారము మారునిములికివలె మెఱయఁదొడంగినది.

అప్పుడు నాకు వారు చేయునుపచారము లిట్టివని చెప్పఁజాలను. ప్రజలెల్ల నన్ను భగవంతుఁడనియె తలంచుచుండిరి. రాజున కల్లుఁడనై రాజ్యమున కధిపతినిగానైయున్న నన్ను ప్రజలు మన్నించుట విధియైనను సహజానురాగములు గలిగియుండుట స్తుత్యమైయున్నది.

మఱియొక నాఁడు మదయంతి తనసఖురాలిచే నీక్రిందిపద్యము వ్రాసి యంపినది.

చ. హరునిశరాసనంబు దునియల్ పొనరించి వసుంధరాసుతం
    బరిణయమయ్యె రాఘవుఁడు పార్థుఁడు ము న్నలమత్స్యయంత్రముం
    బరిగొని ద్రోపదిం బడసె మామకభూతభయంకరార్తి స
    త్కరుణ నడంచి తోలి యొసఁగంబడె నన్నుఁ బరిగ్రహింపుమీ!

ఉ. ప్రీతి మహోపకార మొనరించెఁగదా ! నను నాశ్రయించి యా
    భూత మభూతపూర్వపరిపూర్ణ కళావిభవాభిరామవి
    ఖ్యాతయశోధురంధురుఁడవై తగు ని న్నిటఁదెచ్చి యిచ్చె నా
    హా ! తటిదార్భటీభయదమై జల మిచ్చు ఘనంబువైఖరిన్.

తదనుగుణ్యములైన శ్లోకములు వ్రాసి నే నంపితిని. ఇట్లు మే మొండొరుల మత్యంతప్రేమానుబంధ ప్రకటీకరణపత్రికాప్రేషణంబుల నానందింపుచుండఁ గొండక శుభముహూర్తంబున నమ్మహారాజు నా కామదయంతి నిచ్చి మహావైభవంబున వివాహంబు గావించె. వయస్యా ! మదయంతీసౌందర్య చాతుర్యకళావిశేషంబు లిట్టివని చెప్పుట కిది సమయముకాదు. మఱియొకప్పు డెఱింగింతు. తొలుత ననంగసామ్రాజ్యపట్టాభిషిక్తుండనై యాలావణ్యవతితో ననన్యజనసామాన్య శృంగారలీలాసౌఖ్యాంభోనిధి నోలలాడితిని. అనంతరము తద్రాజ్యపట్టభద్రుండ నైతి. రెండునెలలు పాలించితి నింతలోఁ గుచుమారుండను