పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చేతిలోనుండి సొమ్ము సులభముగావచ్చునా ? మనకున్నతొందర వారి కుండునా ? ఆయనభార్య మడిగట్టికొని నీరుతోడుచున్నది. చే యూరు కొనువఱకు నుపేక్షించితినని బొంకినది.

శ్లో॥ అనుచిత కార్యారంభ స్స్వజనవిరోధో బలీయసా స్పర్ధా
     ప్రమదాజన విశ్వాసౌ మృత్యోర్ద్వారాణి చత్వారి॥

తగనికార్యమున కారంభించుట, బంధుజనవిరోధము, గొప్పవానితో స్పర్ధ, ఆఁడువాండ్ర నమ్ముట ఈనాలుగుపనులు మృత్యుముఖములని చెప్పుదురు. విప్రవరా ! పైచర్యలఁ జెప్పనేల ? మాయిరువురు మనసులుగలసినవి. సాంకేతికము లేర్పడినవి. నిత్యముగలసికొనుచుంటిమి.

అపారస్మారవికారములతో నొడ లెఱుంగనికూటములచేఁ జతుష్షష్టికళానైపుణ్యముమీఱ మమ్మంటియున్న మనోభవుం గృతార్థుం గావింపుచుంటిమి.

ఆహా ! ఆమోహనాంగి శృంగారలీలాచాతుర్యము లేమని చెప్పుదును. కామసూత్రము లన్నియుం జదివినప్రోడ క్రీడ లెట్లుండునో మీకుఁ దెలియదా ? క్రమంబున భయము విడచితిమి. సిగ్గు వదలితిమి. మర్యాద వీటిబుచ్చితిమి. చంద్రముఖి మాయింటికో నేను దానియింటికో పోయిచూచినంగాని యేపనిచేయుటకుం బూనము. లోకాపవాదమునకు జంకక తెగించి మెలఁగఁజొచ్చితిమి.

జనులు మాచేష్టలఁ గొన్నిదినములు చాటుగాఁ జెప్పికొనుచుండిరి. కొన్నిదినములు రచ్చల నిందింపుచుండిరి. చివరకు మాయెదుటనే నిందింపమొదలుపెట్టిరి. ఎవ్వరినీతులు మామది కెక్కినవికావు. చంద్రముఖిమగఁడు కొన్నిదినము లనుమానముజెంది మాయింటికిఁ బోవలదని నిర్బంధించెను. కాని మాటవినక ధిక్కరించి వచ్చుచునే యుండునది. నన్నుఁ దనయింటికి రావలదని యొకనాఁడు నాతోఁ బలికిన వెక్కిరించివచ్చితిని. అతనిమాట లక్ష్యపెట్టక మేము స్వేచ్ఛావిహారంబుల