పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవభూతికథ.

217

భార్యను మాయింటికిఁ బంపెను. నే నింటిలోనే డాగియుంటిని. నాభార్య పెరటిలో నూఁతిలో నీరు చేదుచున్నది.

చంద్రముఖి వచ్చి మెల్లగా అక్కా! అక్కా ! అని నాభార్యం బిలిచినది. నేను, దలుపు తీసితిని. లోపలకు వచ్చినది. మాయక్క యెందున్నదని నన్నడిగినది. దొడ్డిలో నున్నదని, ఆ పనియేదియో నాకుఁ జెప్పరాదా? అని యడిగితిని. మీ రెఱుంగనిదికాదు. మీతమ్మునికి సొమ్మిత్తుమని చెప్పి నన్నుఁ బంపమంటిరఁట కాదా ! ఎఱుఁగన ట్లడుగుచుంటిరేల ? అని యెత్తిపొడిచినది.

నాకు మోహ మగ్గలమగుచుండెను. మేను సాత్వికవికార మందినది. కంపముతో నేను జంద్రముఖీ ! నీకు బదులేల? కావలసినంత ద్రవ్యము తీసికొనివెళ్ళుము అని రూపాయిలసంచి ముంగలవైచితిని. నే నంతయాసగలదానను గాను మీ రిత్తుమన్నవిత్తమే కొనిపోయెద లెక్క బెట్టి యిండు. అని చిఱునగవుతోఁ గ్రేఁగంటిచూపులు నాపై వ్యాపింపఁ జేసినది. ఆచూపులే మరునితూపులై నాయేపడఁగించినవి. అప్పుడు తమినిలుపలేక నేను గాఢముగా నయ్యంగనను బరిష్వంగము జేసికొంటిని.

అదియే నాజన్మావధిలో ననుభవించిన మొదటిసుఖము. చంద్రముఖ లజ్జావిశేషంబునంజేసి యంగీకారసూచకమైన యంతరాయము కొంత గలుగఁజేసినది. అదియు నాకుఁ జాల యింపుగా నుండెను.

నాభర్త వాకిటఁ గాచియున్నాఁడు వేగఁ బోవలె నాలస్యమైన ననుమానముజెందును సొమ్మిచ్చి పంపుఁడు అని బ్రతిమాలికొనినది. వెంటనే సొమ్మిచ్చి యంపితిని. మా కది స్వల్పకాలముగాఁ దోఁచినది కాని చంద్రముఖికై వేచియున్నమగని కది దీర్ఘ కాలమైనది. అతండు భార్యపై నలుగుచు నింతయాలసించితివేల? అనియడిగిన నామె బాగుబాగు, ఒకరి