పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గుచుండునది. క్రమక్రమముగాఁ జనువు గలుగఁజేసి నేనే పల్కరించుటకుఁ బ్రారంభించితిని.

ఒకనాఁడు మాయింటి కెందుకో వచ్చి నాభార్యతో మాటాడుచుండ నోసీ ! చంద్రముఖిం జూడుము, దానిముఖము కలకలలాడుచుండ లక్ష్మి తాండవమాడుచున్నది. దానియొప్పు దానియొయారములో నీ కొకటియైన లేదుగదా ! ఆహా దానిమగనియదృష్టము ! అని పొగడుచుండ ముసిముసినగవు నవ్వుచు వెళ్లిపోయినది.

చంద్రముఖిమగఁ డద్వయనసంపన్నుఁడగుట నేను వానియింటి కప్పుడప్పుడు పోయి వేదములోఁ దెలియనివిషయము లడుగువాఁడుంబోలేఁ బదమో క్రమమో యడుగుచుందును. ఆ సమయమునఁ జంద్రముఖి యేదియో పనికల్పించుకొని పదిసారులు నాకంటఁబడునది.

ఓయీ ! మనమిద్దఱ మొక్కయీడువారము. ఇరువురకు సంతానము లేకపోయినది. అందులకుఁ గొన్నితంత్రము లున్నవి యాచరింతమా? అని పలికినఁ జంద్రముఖిభర్త నావిలాసము లెఱింగియున్న వాఁడగుట రానినవ్వు ప్రకటించి నా కవసరములేదు. నీవే కావించుకొనుమని యుత్తర మిచ్చువాఁడు.

మఱియొకనాఁడు చంద్రముఖిభర్తకు సొమ్మవసరమువచ్చి తొట్రుపడుచుండఁ జూచి చంద్రముఖి మీరు దేవభూతికి మిత్రులుగదా? పోయి యప్పడుఁగుఁడు. ఈమాత్రము సహాయము చేయఁడా! అని ప్రోత్సాహపఱచుటయు నతం డిష్టములేకున్నను గార్యావసరమునుబట్టి నాయొద్దకువచ్చి తనయవసర మెఱిఁగించెను.

అప్పుడు నేను మిగుల సంతసించుచు రెండుగడియలలో నొకఁడు కొంతసొమ్ము తీసికొనిరాఁగలఁడు. నా కొకచోటికిఁ బోవలసిన యగత్యమున్నది. నాభార్యతోఁ జెప్పి పోయెదను. నీభార్యను గడియతాళి పంపుమని చెప్పితిని. అతం డింటికిఁబోయి రెండుగడియ లైసతరువాత