పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోనర్దీయునికథ.

211

నుపాధ్యాయుండు దొరకమి నూత్న విద్యాభ్యాసలాలసత్వంబుతో నా పట్టణంబు విడిచి పెక్కుదేశములు దిరిగితిని. ఎందుఁబోయిన నెవ్వరుఁ గనంబడలేదు.

ఇక్కడి కుత్తరముగాఁ బదియోజనములలో నొకయగ్రహారము గలదు, నేనక్కడికిఁ బోయి నాకువచ్చిన విద్యలఁ బేర్కొని క్రొత్తవిద్యఁ గఱపువా రెవ్వరైన నీయూర నుండిరా ? అని యడిగితిని. ఒక బ్రాహ్మణుఁడు నన్నుఁజూచి యోయీ ! నీవు చిఱుతవాఁడవైనను ననేకవిద్యల యందుఁ బాండిత్యము సంపాదించితివి. నీకంటెఁ జదివికొన్నవారీయగ్రహారమున లేరు. ఇక్కడికి దక్షిణముగాఁ బది యోజనములదూరములో మహారణ్యము గలదు అందొక రావిచెట్టు నాశ్రయించి యొక బ్రహ్మరాక్షసుఁ డున్నవాఁడు. అతనికి రానివిద్యలు లేవు. నీ వక్కడికిఁ బొమ్ము క్రొత్తవిద్య నుపదేశింపగలఁడని యెఱింగించిన సంతసించుచు నక్కడికిఁ బోవు మార్గ మెట్లని యడిగితిని.

అప్పుడు మఱియొకవిప్రుఁడు నామాట విని అయ్యో ! వెఱ్ఱి పారుఁడా! అక్కడికిఁ బోయెదవుచుమీ ? ఇతఁడు పరిహాసమున కట్లనెను. మనుష్యగాత్రముల గారిముక్కలవలె విఱుచుకొనితినియెడు బ్రహ్మరాక్షసుఁడు నీకు విద్యోపదేశము చేయునా ? వలదు వలదు. మఱి యొకదేశమున కరుగుమని యుపదేశించెను.

ఆహా ! సర్వవిద్యాపారంగతుఁడైన యాయన నన్నేమిటికిం జంపును ? శిష్యరికము గావింప విద్యోపదేశ మేల చేయకుండెడిని ? చచ్చినఁ జత్తుఁగాక నందుఁ బోవకమాననని సంకల్పించుకొని వారి కెవ్వరకిం జెప్పక గుఱుతులుజూచుకొనుచు వెదకి వెదకి తిరిగి తిరిగి యతికష్టమున నేటిసాయంకాలమున మాయింటి కతిథినైవచ్చితిని. మత్పురాకృతసుకృతవిశేశంబున మిమ్ముఁ బొడఁగంటి. ఇక కృతకృత్యుండ నగుటకు సందియము లేదు. ఏమిచేసినను లెస్సయే. క్రొత్తవిద్య లుపదేశించిన సంత