పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తునికథ

9

ద్ద కరిగి నమస్కరించి యెదుర నిలువంబడియున్న నన్నుఁ జేరంజీరి నీవెవ్వండ వేమిటికి వచ్చితివని యడిగిన మదీయోదంత మెఱింగించి విద్యార్ధినై వచ్చితిని. విద్యాదానంబు గావింపుఁడని కోరికొంటి నతండు నాచదివిన విద్యలం బరీక్షించి సంతసించుచుఁ దన విద్యార్ధులలో నాతో సహాధ్యాయుఁడుగా నుండ నెవ్వడు సమర్థుడోయని శిష్యులనెల్ల నాతో బ్రసంగింపఁజేసెను. అందఱుఁ గాందిశీకులైరి. మఱియు వారిలో,

క॥ చారాయణుండు మఱి కుచు
     మారుడు ఘోటకముఖుండు మఱిగోనదీన్
     యోరుమతి గోణికాసుతుఁ
     డారయఁగ సువర్ణ నాభుఁడనువిప్రసుతుల్.

సమానవయో రూపమనీషాకౌశలురగు నీ యార్వురుమాత్రము నాతోఁ బ్రసంగింప నిలువంబడిరి. ఆయొజ్జలు సంతసించుచు నయ్యార్వుర నాకు సహాధ్యాయులుగాఁ జేసి యచిరకాలములో సమస్తవిద్యాపారంగతులఁ గావించెను. మేమేడ్వురము సహాధ్యాయులైనది మొదలొక గడియయైన విడిచియుండలేక యేకదేహమట్లు మెలఁగుచు నత్యంతమైత్రితో విద్యలఁ బూర్తిజేసి దేశపర్యటన లంపటులమై తలయొకదారిం బోయి నానాదేశవిశేషంబులఁజూచుచు సంవత్సరమునాఁటికి ధారానగరంబునం గలసికొనునట్లు నియమము చేసికొంటిమి. నేనొక మార్గంబునఁబడి పోవుచు దారితప్పి యిమ్మహారణ్యము జేరి నేటిరాత్రి తేజోలక్ష్యంబున నిక్కడకు వచ్చితిని. మీరు యక్షుదంపతులని మీమాటలవలనం దెలిసికొంటి ననుగ్రహించి దారియెఱింగించినఁ బోపువాఁడ నభ్యాగతుం గాపాడుఁడని ప్రార్థించినవిని కనుఁగవగెంపుగదుర యక్షుం డిట్లనియె.

క॥ మిగులంజదివియు నాలియు
     మగఁడును గ్రీడింపఁబొంచి మర్మంబులఁ జూ