పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యక్షుఁడు -- భోజునియాస్థానకవియఁట ఆ నృపతిచెంత-

యక్షిణి - భోజుఁడన నెవ్వఁడు?

యక్షుఁడు -- ఆతనికీర్తి కిన్నరులు పాడుచుండ వినలేదా? మఱచితివికాఁబోలు! ధారానగరాధీశ్వరుఁడు మహావదాన్యుఁడు.

యక్షిణి — అట్టి పుణ్యాత్ములంజూచి వచ్చితిరా ?

యక్షుడు - చూడలేదు. ఎప్పుడోసోయెద.

యక్షిణి — ఆగ్రంధమంతయుఁ జదివి వినిపింపరా ?

యక్షుడు - ఇప్పుడు ప్రొద్దుపోయినది. ఱేపు వినిపించెద నేదీ? ఆహా! అనిపలుకుచు యక్షుండా యక్షిణితో శృంగార లీలా తరంగితాంతరంగుండై యనంగ క్రీడలనానందించి యక్షిణితన్ననుసరించి రా వాయుసేవకై యీవలకువచ్చుచు ద్వారదేశంబుననున్న యా విప్రకుమారునిం గాంచి భయసంభ్రమలజ్జాలోలచేతస్కయై యక్షిణి దిగ్గునలోనికింబోవ యక్షుండతని నదలించుచుఁ జేయిపట్టుకొనియోరీ ! నీనెవ్వండవు? ఇందేలవచ్చితివి ? దొంగవలెనిందుఁబొంచుంటివేల? నిజము చెప్పుము. అని యడిగిన భయపడుచు నతండు నమస్కరించి యిట్లనియె.

గీ॥ దత్తుఁడనువాఁడ మాధురాత్మజుఁడ నేను
     పాటలీపుత్రనగర సంభవుఁడనందుఁ
     జదివితినిగొంత యొజ్జలసముఖమందుఁ
     గడమవిద్యలఁదెలియ నుత్కంఠగలిగి.

ఉ॥ శ్రీకరజాహ్నవీవిమల శీకరపూతతటస్థితోరువి
      ద్యాకరసుప్రసంగనినదాంచితమద్రి కుమారికా కృపా
      లోకనభావితేష్టనర లోకము శాశ్వతవిశ్వనాథలిం
      గైకపవిత్రభూమి యమృతాశినివాసము కాశికేగితిన్.

అందు మహామహోపాధ్యాయ బిరుదమువహించి పదివేలమంది శిష్యులకుఁ బాఠముఁజెప్పుచున్న క్షేమేంద్రుఁడనునుపాధ్యాయునొ