పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నన్ను గురుతుపట్టలేకపోయితివా ? గోనర్దీయుఁడనని బిగ్గరగా గౌఁగిలించుకొని యానందాశ్రువులచే నతనిం దడుపుచు అయ్యో ! నీవిట్లు చిక్కిపోయితివేమి ? రూపము చాలా మారియున్నది. ఈనావికాధి పత్య మెక్కడ సంపాదించితివి ? నీవు పురందరపురాధిపతికూఁతురు సరస్వతిని విద్యలలో నోడించి యామెం బెండ్లియాడుచుంటివని పత్రికలలోఁ జూచి యక్కడికే పోవుచుంటిని మఱియు యాకుచుమారుఁ డెవ్వఁడు ? ఇది వింతగానున్నదే. నీవృత్తాంతమంతయు నెఱింగించుమని యడిగెను.

అందున్న వారెల్ల రాజుగా రావిప్రునితోఁ జనువుగా మాటాడు చుండుట చూచి విస్మయము జెందుచుండిరి. కుచుమారుండు గోనర్దీయుని కైదండఁగొని యొకవిజనసైకతస్థలమునకుఁ దీసికొనిపోయి యందుఁ గూర్చుండఁబెట్టి ముందు తనకథ యిట్లు చెప్పెను.

వయస్యా ! భగవత్సంకల్పము కడు చిత్రమైనది. మనతలంపొక్కటియును సాగదు. ఉత్తరదేశారణ్యములు సూడవలయునని సువర్ణనాభునితోఁ గొంతదూరము పోయితిని. ఆబాధ కోర్వలేక మఱలి దైవవశంబుస సిద్ధాశ్రమవిశేషములఁ దెలిసికొని నూతనవిద్య సంపాదించి సరస్వతిని వాదములో నోడించి వరింపఁబడితిని. శుబరుండు దుష్టుండని యెఱుఁగక గుట్టుచెప్పితిని. వాఁడు సూడుపట్టి నన్నుఁ దలఁ జిదియఁగొట్టి కందకములోఁ బారవై చెను. . 'ఆయుర్మర్మాణిరక్షతి' అను శాస్త్రమువలనఁ బల్లెవాండ్రవలన నేను రక్షింపఁబడితిని. వాండ్రు నాకుఁగావించిన యుపచారములు జన్మములో మఱువఁదగినవికావు. దయార్ద్రహృదయు లన్నికులములలో నుందురుగదా? పాపము వారునా నిమిత్తము కొంతఋణము జేసిరి. ఆఋణము కొంతతీర్చి యిం దీయుద్యోగములోఁ బ్రవేశించితినని తనయుదంత మాద్యంత మెఱింగించెను.

అప్పుడు గోనర్దీయుఁ డతనిఁ గౌఁగిలించుకొని వెక్కి వెక్కి