పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెవాండ్రకథ.

203

ఆబేహారు లతఁడుకోరిన సొమ్మిచ్చుట కొప్పుకొనిరి. అతండు పల్లెవాండ్రం జీరి తననిమిత్తమై వాండ్రువాడిన విత్తపు పట్టికం దీసికొని దాని కిబ్బడిగా వర్తకులచేత వారి కిష్పించెను. వాండ్రు మిగుల సంతసించు చుండ నోరీ ! మీకు నాకుఁ బ్రాణదానము గావించితిరి. నే నేమిచ్చినను మీయుపకృతికి సరిపడదు. ఇప్పుడు చెప్పరాదు కాని నే నొకప్పు డీదేశమునకు రాజును గావచ్చును అప్పు డేమైన నుపకారము సేయఁ జాలుదునేమో యని పెద్దగా వాండ్రం బొగడి పురోహితునిగీర్తించి వారి వలన నామంత్రణంబు వడసి వర్తకులవెంట నేటియొడ్డునకుఁ బోయెను.

అది గొప్పరేవు. బాటసారులు వేలకొలఁది నిత్యమారేవు దాటి పోవుచుదురు. ఆయిజారాదారు బాటసారులవల్ల సొమ్ము సేకరించుటకును పద్దులు వ్రాయుటకును నావికులకెల్లఁ దగినపనులు సెప్పుటకును నాబ్రాహ్మణునకు సర్వాధికార మిచ్చి యందుఁ గాపురముండునట్లు చేసెను.

అతండు మార్గస్థులవలనఁ గాసైన బీరువోకుండఁ గైకొనుచు బాటసారుల కాటంకములేకుండ వెంట వెంటనే యోడల నడిపించుచు సత్యమైనలెక్కలు వ్రాసి యానెలలోఁ దనయజమానుని కెక్కుడు లాభము చూపించెను. అతనిసత్యప్రవర్తనము దెలిసికొని గుత్తదారుఁడు వేతన మభివృద్ధిచేసి యన్ని పనులు నతనిమీఁదనే వదలివైచెను;

మఱికొన్నిదినములు గడిచినంతఁ గొందఱువిద్వాంసు లారేవు దాటుటకై యక్కడికివచ్చి సొమ్ముపుచ్చుకొనుచున్న యావిప్రుం జూచి అయ్యా ! మేము పండితులము. పురందరపురమున కరుగుచుంటిమి. తన్నగరాధీశ్వరునికూఁతుకు సరస్వతి కుచుమారుండను సూరిసత్తముని వివాహమాడుచున్నది. అమ్మహెూత్సవమునకుఁ బండితులనెల్ల రమ్మని శుభలేఖలు వ్రాసిరి. మేము దూరమునుండి వచ్చుచుంటిమి. మమ్మూరకయే రేవు దాటింపవలయునని కోరుచు నాశీర్వచనశ్రుతి యొకటి చదివి