పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెవాండ్రకథ.

201

ఆపదలు గలుగఁజేయుటయు వానిం బోఁగొట్టుటయు భగవంతునిపనియై యున్నది. అందులకే “భయకృద్భయనాశనః" అని భగవంతునిఁ బొగడి యున్నారు. వారియుపచారమువలన నారోగి మఱునాఁ డుదయమునకు బాగుగా నూపిరి విడుచుచుండెను. బెస్తలు సంతసించుచు నామంచము విడువక మఱియు ననేకములగు చికిత్సలు సేయుచుండిరి. మూఁడు దినములవఱకుఁ గన్నులు తెఱవలేదు. నాలుగవనాఁడు కనులఁదెఱచి దాహ మిమ్మని సూచించెను. పాలు దాహమిచ్చిరి. పిలిచినఁ బలుక లేదు.

ఆవుపా లాహారముగా నిచ్చుచుండ మఱినాలుగుదివసముల కతనికి స్మృతిగలిగినది. అప్పుడు పల్లెవాండ్రు అయ్యా ! మీ దేదేశము ? కందకములోఁ బడియుంటిరేల ? మి మ్మెవ్వ రిట్లు చేసిరి ? మీవృత్తాంతము సెప్పుఁడని యడిగిన నతండు మందస్వరముతో నా కిప్పు డేమియు జ్ఞాపకములేదు. మీరు నన్ను బ్రతికించితిరి. మీకు నేను దాసుండనై యుండెదననిమాత్రము సెప్పెను.

పల్లెవాండ్రు సొమ్మిచ్చుచున్నవారు కావునఁ బురోహితుఁడు వానికి నుపచారములు చక్కఁగాఁ జేయుచుండెను. క్రమంబున మెదడు పూడికొనుటచే నతనికిఁ బూర్వపువ్య క్తి గలుగఁ బ్రారంభించెను. తన్ను శంబరుండు నిద్రించుచుండఁ దల నలియఁగొట్టి కందకములోఁ బార వై చెనని తెలిసికొనియెను. పల్లెవాండ్రుచేసిన యుపచారములగుఱించి యూరక స్తుతియించుచుండెను.

తెలిసినతరువాతనైనఁ దనభంగపాటు వాండ్రకుఁ జెప్పలేదు. కూర్చుండుటకు శక్తిగలిగినప్పుడు పల్లెవాండ్ర కేమియుపకారము చేయుదునని యాలోచించుచుండును. పల్లెవాండ్రు ఆయననిమిత్తమై చెక్కలకును వేరులకును బసరులకుఁ దిరుగుచుండుటచేఁ దమవృత్తిసేసికొనుట కవకాశము గలిగినది కాదు.

ఆరోగినిమిత్తమైన ఋణము నలుగురు సమముగాఁ బంచుకొన