పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వలయును. అనిన నింకొకఁడు వీనిమెడలో నేదియో మాలికయున్నది చూడుఁడు అని పరీక్షించి ఇసిరో యెముకలు ఎముకలు. వీఁడెవఁడో దరిద్రుఁడు. చిన్న మెత్తుబంగారమైన మేనలేదే అని పరిహసించెను.

ఎట్లైనను బేమ్మడిని రచ్చించుట పున్నెముగదా. మన మీవల వై వనిచో నీపఆటికి వీఁడు కడతేరియేయుండును. మనము వీనిం దీసికొని మనబేమ్మడి కప్పగింతము. చ స్తత పడువరకు నాయనచే నుపచారములు సేయింతము. అందులకైన సొమ్ము మనమేయిత్తము. కుదిరిన తరువాత నంతయు వీనియొద్దఁ బుచ్చుకొందము అని నిశ్చయించుకొని యానలువురు వలమడతబెట్టి యందు వానిం బరుండఁబెట్టి యుయ్యలవలెఁ గొయ్యకుఁ దగిల్చి నలువురు మోసికొనిపోయి పురోహితునింటికిం జని కేకపెట్టిరి.

ఆయన వచ్చి తలుపుతీసి యిదియేమియని యడిగెను. వాండ్రు నవ్వుచు మీకు ముడుపు తీసికొనివచ్చితిమి కైకొనుఁడు అని పలికిన నప్పాఱుండు దీపముదెచ్చి చూచి యితఁ డెవ్వఁడు? అని యడిగిన వాండ్రు జరగినకథయంతయుం జెప్పిరి. అయ్యో ! వాని నా కేమిటికి ? బ్రదుకునో బ్రదుకఁడో ఈగొడవ నా కేల ? తీసికొనిపొండు అని ఫలికినఁ బెద్దవాఁడు సామీ ! మీ కింత దయలేదేమి? మీకులమువానికి మాకూడు బెట్టిన నొప్పుకొందురా ? మీ రుపసారములు సేయుఁడు, అందులకైనసొమ్ము మే మిచ్చుచుందుము. బాగుపడినపిమ్మటఁ గూలిపని యైనం జేసి మనరుణము తీర్చకుండునా ? పోనిండు. తీర్చనిచో' మన దాసుండని పిలువఁబడుచుండును. అని యుపదేశించి యావిప్రు నంగీక రింపఁజేసెను.

లోపలికిఁ దీసికొనిపోయి మంచముపైఁ బరుండఁబెట్టిరి. మంట వైచి తడియార్చిరి. నలిగి రక్తముగారుచున్న తలకుఁ జేఁపపొట్టుతోఁ గలిపినూరిన వేపాకు పట్టువైచిరి. విధిపరిపాకము కడువిచిత్రమైనదికదా!