పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెవాండ్రకథ.

199

మఱియొకఁడు - నంతేకాదురా ఇంటి కేగం గొట్టింపఁగ నౌ గణేశునకు టెంకాయల్

ఇంకొకఁడు - బలే బాపనయ్యం గాదందువు రా?

వేరొకఁడు – సెబా సదియే ముఖ్యం బాదితీర్చంగఁ

అందఱు - జెప్పంగా నేటికి వారిదే ముడుపు ప్రాప్తం బిందు ముమ్మాటికిన్ .

శా. గంగానమ్మకుఁ బప్పుపానకము లీగాఁ దెప్పఁ గట్టింప నా
    దిం గావింపవలెన్ సరాసరిగ నంతేకాదురా యింటి కే
    గం గొట్టింపఁగ నౌ గణేశునకు టెంకాయల్ బలే బాపన
    య్యం గాదందువురా సెబా సదియ ముఖ్యం బాది దీర్పంగఁ జె
    ప్పంగానేటికి వారిదే ముడుపు ప్రాప్తం బిందు ముమ్మాటికిన్ .

అని యీరీతి వాండ్రు మాటలాడికొనుచు సంతసముతో నాజాలమును లాగి యొడ్డున దులిపిరి.

బాబో శపమురో శపమురో యని భయపడుచు నలువురు వలవిడిచి దూరముగాఁ బరుగిడిరి. అల్లరిజేసిన రాజభటులు పట్టుకొందురని యాలోచించి గడ్డితుంట వెలిగించి మెల్లగా దాపునకుఁ బోయి యాశవమును బరీక్షించి చూచిరి. దానిమెడకు రాయి గట్టఁబడియున్నది.

అందొకఁడు ఒరే పాపము వీని నెవ్వరో తల నలియఁగొట్టి మెడకు రాయిగట్టి చచ్చెననితలంచి యింతకుముందే యీకందకములోఁ బారవేసియుందురు. వీనియాయువు గట్టిది. యూపిరి యాడుచున్నది. వీనిం బ్రతికించిన మనకు మంచిపున్నెము రాగలదు, వీని మెడలో దందెములున్న వి. భేమ్మఁడు కాఁబోలుననిన మఱియొకఁడు నవ్వుచు మన కిందు మొదటదొరకినవస్తువును మనభేమ్మడికిత్తుమని చెప్పివచ్చితిమిగదా. ఈ భేమ్మడి నాభేమ్మడి కిత్తము అనుటయు వేరొకఁడు సరిసరి, వీనినిచ్చిన నాయన యేమిచేసికొనును ? పై పెచ్చు తెగులుకుదురువఱకు తిండిపెట్ట