పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గలఁడు. వా రాపురోహితు నడుగక క్రొత్తవలవేయుటగాని క్రొత్తయోడ నీటిలోఁ ద్రోయుటగాని నీటిలోనియోడల బాగుచేయుటకుఁ దీరము జేర్చుటగాని చేయరు.

ఒకనాఁడు నల్వురుబెస్తలు పురోహితునొద్దకుఁ బోయి జోహారు సేయుచు స్వామీ! మేము పెద్దవల నొకదాని నల్లుకొంటిమి. దాని నుపయోగించుటకు మంచివేళ నెప్పుఁడని యడిగిన నాబ్రాహ్మణుఁడు పంచాంగముజూచి యంకెలువైచి లగ్నముగట్టి నాఁటియర్ధరాత్ర మనుకూలముగా నున్నదని తెలియఁజేసెను.

స్వామీ ! పురందరపురము కోటయగడ్తలోనికిఁ గ్రొత్తనీరు వచ్చినదని తెలిసినది. ఆది మిక్కిలి లోతుగలది. అందు గొప్ప గొప్ప చేఁపలున్నవని చెప్పుచున్నారు పగ లందు వలవేయనీయరు. ఈరాత్రి మేము పోయి మీరుసెప్పినవేళకు వల వేయుదుము. ముందుగా నందులోఁ బడ్డవస్తువు మీదేను. దాన వచ్చినసొమ్ము మీకిత్తుము. అని మ్రొక్కి కొని వాండ్రు పురోహితుని సెలవుతీసికొని నాఁటిరేయి పెందలకడ భోజనములుసేసి వల మోచుకొనిపోయి చుక్కగుఱుతు చూచుకొని కోట వెనుక మారుమూలగానున్న కందకములో జే పరమేశ్వరా ! అని పలుకుచుఁ గొత్తవల గుభాలున నాపరిఖలో వైచిరి. నూఱుగజముల త్రాడు మునిఁగినది.

గీ. తల్లి ! భాగీరధీ గంగ దండమమ్మ
    వరుణదేవర మమ్ముఁ గాపాడవయ్య
    నీటివేలుపులార మన్నింపు డిపుడు
    కృపను వలనిండఁ జేఁప లెక్కింపరయ్య.

అని పాడుచుఁ ద్రాడు లాగుట ప్రారంభించిరి. బరువుగాఁ దోఁచి నంత గంతులువైచుచు,

ఒకఁడు - శా. గంగానమ్మకుఁ బప్పుపానకము లీగాఁ దెప్పగట్టింప నాదిం గావింపవలెన్ సరాసరిగ