పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబరునికథ.

193

కొనిరా? అని యడిగిన నతండు పాప మాచిలుక నిన్నవచ్చి మచ్చికతో నాతో ముచ్చటించుచుండెను. నేను వేఱొకపనిమీఁద లోపలికిఁ బోయి వచ్చునంతలోఁ బొంచియున్న యొకపిల్లి తటాలున దానిగొంతువు పట్టుకొని యీడ్చికొనిపోయి చంపినది. అందులకే విచారించుచున్నవాఁడ. దానికి విద్యలన్నియు నుపదేశించితిని. మాకు దూతికయై వార్తలం దెలుపుచున్నది. దాని కాయువు సరిపడిన మన మేమిచేయఁ గలము అని చెప్పెను.

అమ్మయ్యో ! యెట్టిమాటవింటిని? పలుకులు కళలు తెలిసికొనినపిదప మాభర్తృదారికకు దానియెందెంతయో ప్రేమకుదిరినది. ఈమాట వినిన మిక్కిలి పరితపింపఁగలదు. మహోత్సవ సమయమున నీవిచార మామెను బాధింపకమానదు. అని పలుకుచుండ నామాట మఱుగుపడునట్లు మఱియొకప్రస్తాపము దెచ్చుచు సారసికా ! ఇదిగో మీరాజపుత్రిక పంపిన ముత్యాలహారము చూచితివా ? కుచుమారులు మీరేనా? మీరేనా? అని పలుమారడిగితివి. ఈహార మది కానిచో నేను మఱియొకఁడ నగుదును. అని పలికెను.

అప్పు డది యతఁడు కుచుమారుండు కాడని నిశ్చయించుకొని మొగంబున విన్నదనంబుదోఁప సరస్వతియొద్ద కరిగెను.

ఆచిన్నది కొన్నియడుగు లెదురువచ్చి మచ్చెకంటీ ! అచ్చటివిశేషము లేమి? ఆవిద్వచ్ఛిఖామణిం గంటివా? మాట్లాడితివా? రూపము వ్రాసికొనివచ్చితివా ? ఎట్లున్నది? చిలుక యేదీ? అని యడిగినఁ గన్నుల నీరుగ్రమ్మ తొలుతఁ జిలుకవార్త దెలిపినది. అందులకై పెద్దతడ వమ్ముద్దు గుమ్మ విచారించినది.

వారించుచు సారసిక సఖీ ! నీ వాతఁడు గొప్పవిద్వాంసుడని ముఱయుచుంటివికాని నామది కంత నచ్చలేదు. అదియేమియోకాని వానినూపము చిత్రఫలకమున వ్రాయ బుద్ధిపుట్టినదికాదు. ఊరక తిరిగి