పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబరునికథ.

191

రాజపుత్రిక చిలుకచేఁ బంపిన కుచుమారుని సందేశము విని ప్రహర్షపులకితగాత్రయై దాని నత్యంత ప్రీతిపూర్వకముగా నాదరించుచు మఱికొన్నిమాటలం జెప్పి మఱునాఁడుదయంబునఁ గుచుమారు నొద్ద కనిపినది. ఆరామచిలుకయు జివ్వున నెగిరి కుచుమారునిబస కరిగి యందున్న శంబరుంజూచి విస్ఫుటాక్షరములతో అయ్యా ! మాగురువులు కుచుమారు లెందున్నవారు ఎఱింగింపుఁడని యడిగిన నతండు నేనే కుచుమారుండ మఱచిపోయితివా ? చిలుకా ! నీకొఱకై నేరేఁడు పండ్లు తెచ్చి యుంచితిని. తినుము. నీరాక వేచియున్నాను. అని పలికిన విని చిలుక యిట్లనియె.

అయ్యా ! మీదయయుండిన నేరేఁడుపండ్లకుఁ గొదవలేదు. పరిహాసము విడిచి వారెందుండిరో చెప్పుఁడు.

మిమ్ము నేనెఱుంగనిదానను గాను. మీ రాయనమిత్రులు మొదటినుండియు మిమ్ము నే నిందుఁ జూచుచుంటి. రాజపుత్రిక సందేశ మొండు జెప్పవలసియున్నది. వేగ మాయన యెందుండిరో చెప్పుఁడని యడిగిన వాఁడు మది దిగులుపడ శుకమా ! రాజపుత్రికాసందేశ మేదియో నాకుఁ జెప్పుము. నీకు మంచి పండ్లుపెట్లెద ననవుడు నది అయ్యో ! భార్యాభర్తలనడుమ నొడువు లొరుల కెఱింగింపవచ్చునా ? మీయెఱుంగని ధర్మము లున్నవియా ? అది తప్పుపనియని పలుకుచుండఁ దటాలున దానిం బట్టికొని ఓసీ ! పులుగా ! నీరాజపుత్రిక చెప్పినమాట లేవియో చెప్పుము. లేకున్న నీగొంతువు పిసికి చంపెదఁ జూడుమని కాళ్లొకచేతఁ గంఠ మొకచేతం బట్టికొని చెప్పెదవా? చంపనా? చెప్పెదవా? చంపనా ? అని యెన్నిసారులడిగినను గిలగిలఁ గొట్టికొనినదికాని నిజము చెప్పినదికాదు.

ఆచిలుకయుండినఁ దనగుట్టు బయలగునని తలఁచి యాదుష్టుండు జాలిలేక యాశుకముకంఠము నులిమి చంపి పారవేసెను. పిట్టప్రాణ