పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నోయున్న మిత్రులకు రాజ్యము పంచునఁట. నాకును నాతలిదండ్రులకును భోజనముసేయుటకై పెండ్లిపెత్తన మిచ్చునఁట. వీనిం బరిభవించిన తప్పులేదు. అని తలంచుచుఁ బ్రకాశముగా నార్యా ! నేఁడు నాకు దేహములో నస్వస్థతగానున్నది. అందుల కిట్లుంటినని సమాధానము చెప్పెను.

అట్లైనఁ బెందలకడఁ బండికొనుము. అని వానితో ముచ్చటించి కుచుమారుండు గాఢముగా నిద్రబోయెను. ఆయన గుఱ్ఱువినంబడినతోడనే లేచి శంబరుం డంతకుముందు సంగ్రహించియుంచిన పాషాణము మెల్లగ నెత్తి గుభాలున యతని నెత్తిపై వైచి చేతనమును బాయఁ జేసి యప్పుడే యాశవము నెత్తికొనిపోయి యాకోటకందకములోఁ బాఱవైచి తానే కుచుమారుండనని ప్రకటింపుచుండెను.

శ్లో॥ వాంఛాసజ్జనసంగతౌ పరగుణే ప్రీతిగున్‌రౌ కౌ నమ్రతా
     విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిలోన్‌కాపవాదాద్భయం
     భక్తిశ్ళూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తిఃఖలై
     రే తెయేషువసంతినిమన్‌లగుణాస్తెభ్యోమహద్భ్యోనమః॥

దుర్జనుల సంసర్గ గలిగినంత నెప్పటికైన ముప్పు వాటిల్లునని శాస్త్రములు చాటింపుచున్నవిగదా ?

అని చెప్పునప్పటికిఁ గాలాతీతమగుటయు నంతటితో విరమించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

156 వ మజిలి

−♦ శంబరునికథ . ♦−

గీ. ప్రాణ మర్పించుటకు నొడంబడునుగాని
    బలిమి యజమానుని రహస్యవాచకంబు
    నెఱుఁగఁజెప్పఁడు పరులకు నెంతయైన
    నాత్మవిస్రంభపాత్రుఁ డైనట్టిదూత.