పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

క్షించి తదీయనిరాఘాటపాండిత్యప్రకర్షము దెలిసికొని చేతులుజోడించి శుకరాజమా ! మీగురుండు త్రిభువనైకవిద్యత్ప్రవరుండు, నన్ననుగ్రహింపఁ జతురాననుండీయవతారమునఁ జనుదెంచెను. కానిచోఁ జెప్పినమాట యొకటియైన నుచ్చరింపనేరని నీవు తదుపదేశంబున గంగాప్రవాహమువలె నాశుధారాకవిత్వముతో శాస్త్రముల నిట్లు గురిపింపనేర్తువే? ఆతండే నాకు భర్త. ఆతండే నాహృదయేశ్వరుండు. ఆయనతోఁ బ్రతికూలముగాఁ బలికి తిరస్కరించినందులకు క్షమింప వందనశతంబు లర్పించుచున్నదాన. ఇదిగో యీహారమును దీసికొనిపోయి నీవు నాకుమారుగా వారిమెడలో వైచిరమ్ము. పొమ్ము. నాయెడ విశ్వాసముంచుము. అని ముత్యాలహార మొకటి దాననోటి కందిచ్చినది.

హంస తామరతూడుంబోలె నాపేరు ముక్కునంగైకొని గ్రక్కున నెగిరి యాఖగవరంబు రయంబునఁ గుచుమారునొద్ద కరిగి యాతొడ వతనిమెడలోవైచి యందుజరగినవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆబుధుం డాకథ విని యాపత్రరథమును ముద్దుపెట్టుకొనుచుఁ బతగేంద్రమా ! తొల్లి నలదమయంతులకు హంసయుఁబోలె నీవు మాకు దూతికాకృత్యము నెఱవేర్చుచుంటివి. వెండియు సరస్వతియొద్దకుం బొమ్ము. ఆమెపేరు నురంబునఁ దాల్చితినని చెప్పుము. విశేషములఁ దెలిసికొనిరమ్ము అని పలుకుచు నాచిలుక నాశుకవాణినొద్ద కనిపెను.

కుచుమారుండు శంబరునియం దత్యంతవాత్సల్యము జూపుచు నెప్పటికథ నప్పుడు వానికిఁ జెప్పుచు నొకనాఁ డిక రాజ్యలక్ష్మితోఁ గూడ సరస్వతి దనకుఁ దక్కఁగలదని నివేదించెను. అప్పుడు శంబరుఁడు అయ్యా! మాతండ్రియుపదేశంబునంగదా మీ రిందు వచ్చితిరి. రాజ్యము వచ్చినపిమ్మట నావిశ్వాసము మీ కుండునో యుండదో తరువాత నాతో మాటాడుదురో మాటాడరో యని యడిగినఁ గుచుమారుండు నవ్వుచు శంబరా ! యీరాజ్యము శాశ్వతమా ? రాజ్యపదము నన్నం