పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతి కథ.

187

జెప్పిన విద్యనెల్ల స్వరగ్రాహిణియంత్రమువలె నాకర్షించుచు నుచ్చరించుచుండెను.

చతుష్టష్టికళలు దానికిఁ బ్రసాదించి కుచుమారుండు మఱునాఁడాచిలుక నాకలికి యుతఃపురమున కనిపెను

ఇంపులగు పలుకులు పలుకుచుఁ దనదెస కరుదెంచిన రామచిలుకంజూచి యబ్బురపాటుకోఁ దనచేతిపై కెక్కించికొని యమ్ముద్దుగుమ్మ మొద్దుచిలుకా ! సుద్దులేమైన నేర్చికొంటివా ? అని యడిగిన నాశుకవరం బమ్మా ! నేను మొద్దుచిలుకనో ముద్దుచిలుకనో యిటుమీఁదఁ దెలిసికొనఁగలవు. నేను గుచుమారుని శిష్యుండనైతిని. అమ్మహాత్మునిచే శిక్షింపఁబడితిని. న న్నేవిద్యలలో నడిగెదవో యడుగుము. వాదమునకు రమ్ము, ఆతండే నేను అనిపలికిన విని యక్కలికి యులికిపడి ఔరా! పలుకనేరని యీకీర మెన్నిమాటలాడినది ? అతండు మిగుల ప్రౌఢుండగును. దీనిం బ్రాలాపించి చూచెదంగాక యని తలంచి యిట్లనియె.

కీరమా ! నీవు కుచుమారుని ఛాత్రుండవగుట మాకుఁబ్రతివాది వైతివి. ఏదీ! చతుష్టష్టికళలపేరులు సెప్పుము చూతము నీపాండిత్యము. అనుటయు నాచిలుక యౌరా ! కుచుమారుని శిష్యుండనఁట. అఱువది నాలుగువిద్యలపేరులు సెప్పవలయునఁట. ఇది యెంతతేలికప్రశ్నము. అమ్మా ! పేరులేకావు. ప్రతివిద్యయందును బ్రసంగించి జయమందెదఁ జూడుము. అని ధిక్కరించిపలుకుచు వానిపేరులు 1 గీతం, 2 వాద్యం, 3 నృత్యం, 4 ఆలేఖ్యం, 5 విశేషకచ్ఛేద్యం మొదలగు 64 ను వైనయికీన వైజయికీన వ్యాయామకీనాది విద్యాగ్రహణం. అని యేకరువుపెట్టినది.

ఆయుపన్యాసమువిని యక్కలికి చిలుకా ! యెతవక్తవైతివి ? బాపురే ! ఎంతపండితురాలవైతివి? అని మెచ్చికొనుచు ముద్దువెట్టుకొని మఱియు నాఱుశాస్త్రములయందును బ్రహేళికలయందును బరీ