పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ముసేయ బయలువెడలిన మాబోఁటివా రంతఃపురమునుండి యేరికడనో నాలుగుమాటలు నేర్చికొన్న బోఁటులతోఁ బ్రసంగింపలేకపోయినచో నిఁక విద్యాపరిశ్రమముకు ఫలమేమి ? సరస్వతినై నం బ్రతిఘటింపఁజూలు నాకడనా? ఈవెడమాటలకు నేనించుకయు వెఱవను నే నాతెఱవ యిచ్చిన ప్రశ్నలకు సమాధానము సెప్పలేకపోయితినేని మీరు నియమించినశిక్షకుఁ బాత్రుండ నగుదునని శపథము చేసెను.

అయ్యా ! మీరు గెలువుఁడు, ఓడుఁడు, మా కింతయేల ? మాట వరుస కంటిమి. మీ రట్టివారు కావచ్చునని హెచ్చరించుచు నతండు వసింపఁదగిన నెల వేరుపఱిచి తదీయకులశీలవిద్యావిశేషంబులు వ్రాసి సరస్వతియంతఃపురమున కనిపిరి.

సరస్వతియు మంత్రులంపిన పత్రికం జదివికొని చిఱునగవుతో నౌరా ఈపాఱుం డెవ్వఁడో బీరములు పెక్కులు పలికెనే? చెప్పినంత చేయువారుండరు. బ్రాహ్మణుల నవమానించుట నాయభిమతము కాదు. నా రేదియోకొంత చదివియే యుందురు. కాని - మదీయవిద్యావాద ప్రకార మెఱుంగక యప్పనికిఁ బూనికొనుచున్నాఁడు. కానిమ్ము. బాహ్మణసత్కార మిహపరసాధనము గదా? అని తలంచి వేయు న్నూటపదాఱు లిచ్చి యాపండితు నంపవలయునని మంత్రులకుఁ దిరుగా వ్రాయించి యంపినది.

సచివు లాకానుకలు ప్రత్యుత్తరముతోఁగూడఁ గుచుమారు నొద్ద కనిపిరి. ఆమెవ్రాసినపత్రికయం దిట్లున్నది. బ్రాహ్మణులు వందనీయులు వారినోడించుట నా కిష్టములేదు. నాచరిత్ర మెఱుంగక సాహసించి ప్రసంగింపవచ్చినందులకు, సంతోషించి యీ కానుకల నంపితి. వీనిం గైకొని నన్నాశీర్వదింప వేఁడుచున్న దాన.

సరస్వతి.

ఆపత్రికం జదివికొని కుచుమారుండు స్మేరాంకూరవిభాసితాన