పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యక్షుఁడు - ఓహో! నీకు మంచిసంగతిచెప్పుట మఱచితినే. వినుము అది మన చరిత్రము మేఘసందేశమను గ్రంథము ఒకగ్రామములో విద్యార్థులు నల్లించుచుండఁదిరోహితుండనై దాపునకుఁబోయి యాగ్రంథమంతయు భూజన్ పత్రములమీఁద వ్రాసికొని వచ్చితిని. మొదటి శ్లోకము వినుము.

శ్లో॥ కశ్చిత్కాంతా విరహగురుణాస్వాధికారాత్ప్రమత్తః
     శాపేనాస్తంగమిత మహిమావర్ష భోగ్యేణభర్తుః।
     యక్షశ్చ క్రేజనకతనయాస్నాన పుణ్యోదకేషు
     స్నిగ్ధచ్ఛాయాతరుషువసతింరామగిర్యాశ్రమేషు॥

యక్షిణి - అవును. ఇప్పుడు మీరు చెప్పిన శాపవిధానమంతయు దీనిలోనున్నది. మేఘసందేశమన నేమి?

యక్షుఁ డు— నేనప్పర్వతముపైఁ గుబేర శాపగ్రస్తుండనై యున్నంత మేఘోదయమైనది. ఆ మేఘముచేత నీకు సందేశమంపితిని. అంచులకే దానికాపేరు పెట్టెను.

యక్షిణి — ఏదీ మఱియొకశ్లోకము తీసి చదువుఁడు?

యక్షుఁడు – నీకుస్పష్టముగాఁ దెలియగల దీశ్లోకమువినుము.

శ్లో|| తత్రాగారం ధనపతిగృహా నుత్త రేణాస్మదీయం
     దూరాల్లక్ష్యంసురపతిధను శ్చారుణా తోరణేన ।
     యస్యోపాంతే కృతకతనయః కాంతయా వర్ధితోమే
     హస్త ప్రాప్య స్తబకనమితో బాలమందారవృక్షః ॥

అనినేను మేఘునితో మనయింటిగురుతులు చెప్పితిని.

యక్షిణి - మనయిల్లు కుబేరుని యింటికుత్తరముగా నున్నట్లును మనదొడ్డిలో గుత్తులచే వంగియున్న మందారవృక్ష మున్నట్లు మీరు చెప్పుచుండ నతఁడువినెనా ? లేక యెప్పుడైన మసయింటికి వచ్చి చూచెనాయేమీ ? ఆకవికెట్లు తెలిసినది ? మీరు మేఘునితోఁ జెప్పు చుండ నాప్రాంతమందుండి వినెనేమో ?