పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తునికథ

5

యైనను యుగాంతరము లైనట్లైనది. అబ్బా! ఆమాట దలంచుకొనిన మేనుజల్లుమనుచున్నది. కుబేరుని కేమి యపరాధముఁ జేసితిమని యట్టి శాపమిచ్చెను.

యక్షుఁడు - కుబేరుండొక నాఁడొక సౌరనారీమణిని వరించి యమ్మించుఁబోఁడిం దీసికొనిరమ్మని నాకు నియమించెను. నేనింటికి వచ్చి భవదీయాధరసుధారసపాన మత్తుండనై యావృత్తాంతముమఱచి యందుఁ బోయితినిగాను. క్రీడాభిరతి నఱుగలేదని యెఱిఁగి విరహాతురుండై రాజరాజు చిత్రకూట పర్వతంబునఁ బండ్రెండు మాసములు వసించి యలకాపురంబు జేరకుండునట్లు శిక్షవిధించెను.

యక్షిణి - అదియా? కారణము ఆహా? ఆమహాపత్సముద్రము నెట్టుతరించితిమో తెలియదు. పోనిండు మనమిల్లును వాకిలిని విడిచి యెంతకాలమిందుండవలయును.

యక్షుఁడు — ఆధూర్తకుబేరుని సేవసేయుట నాకిష్టములేదు. అందుండిన నేవియో లేనిపోనిపనులు సెప్పి తప్పులుగణించుచుండును. ఈగుహాంతర మత్యంతరమణీయమై యున్నది. మనయింటనున్న వస్తు సముదాయమెల్ల నిందుతెచ్చితిమిగదా? ఇది యేకాంత ప్రదేశము. క్రీడాయోగ్యమైయున్నది. ఇందేయుందము.

యక్షిణి - పోనీమనము మఱియొక దేవతానగరమునకుఁబోయి సుఖింపరాదా ? యీ యరణ్యములో వసింపనేల?

యక్షుఁడు - కుబేరశాపంబుస దేవలోకనివాసమున కహన్‌త పోయినది. పగలెల్ల భూసంచారము సేయుచు విశేషములం జూచివచ్చి రాత్రుల నీ కెఱింగింపుచుందును. ఇదియే? సుఖింపఁదగిననెలవు.

యక్షిణి - మనోహరా! విశేషములనిస జ్ఞాపకమువచ్చినది. నేడు సాయంకాలమునఁ బదిలముగా మూటగట్టికొని వచ్చితిరి. అదియేమి?