పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధునిస్వీయచరిత్ర కథ.

179

లలోఁ దపంబు గావించుకొనుచున్నాఁడు. అతఁడే నేను.

అనియున్న యాచరిత్రమును జదివి కుచుమారుండు కనుల నానందబాష్పములుగ్రమ్మ నోహో ! యామహానుభావునిఁ జూచుభాగ్యము నాకుఁ బట్టినదికాదు. అతం డీనడుమనే పరమపదించినట్లున్నది. ఆహా ! ఎట్టివారికి నెంతకాలముబ్రతికినను మరణము తప్పదుగదా ? అని తలంచుచు .మఱియుఁ బసరువ్రాసి యాపుస్తకములోనున్న విశేషముల మఱికొన్నిటిని బరిశీలింపఁగలిగెను.

అం దోషధీవిశేముల తెఱఁగును మూలికాప్రయోగమువలన మనుష్యుల మృగములఁ బక్షులఁ జేయువిధానము కవిత్వప్రశంస లోనగువిషయములు వ్రాయఁబడియున్నవి. అవి తపస్సాధ్యములైనను దన యస్తిమాలనుధరించినవారికిఁ బ్రసన్నములగుని యాపుస్తకమునందే వ్రాయఁబడియున్నది. అప్పు డతం డతనియస్తు లందెందైన నున్నవియేమోయని యాతటాకముచుట్టును దిరిగిచూచెను.

ఒకవంకఁ దటాకమునీటిప్రాంతమున మేదోమాంసరుధిరశూన్యంబైన సిద్ధుని యస్తిపుంజము గనంబడినది. అప్పు డతండు పరమసంతోషముతో నాకళేబరము చెంతకుఁబోయి విమర్శించి కపాలము భిన్నమై యుండుట తిలకించి యతండు యోగమార్గంబున శరీరము విడిచెనని నిశ్చయించి వెండికడ్డియలవలె మెఱయుచున్న యాయస్తుల నీటిలోఁ గడిగి ముఖ్యమైనవాని నేరి త్రాఁటితో మాలికగాఁగట్టుకొని మెడలో వైచికొనియెను. అప్పు డతనిహృదయమున ననేకవిషయములు స్ఫురించుచుండెను. చిరకాలము తపంబుసేసినంగాని లభింపని వశిత్వవిద్య కుచుమారుని కరనిమిషములో లభించినది.

పశుపక్షిమృగాదులలో నేదిగనంబడినను బిలిచినంతనే వచ్చి శిష్యుండువోలె నుపచారములు సేయుచుండును. అయ్యడవిలో నేయోషధిపేరుపెట్టిపిలిచిన నాయోషధి కదలుచుఁ దనస్వరూపము తెలియఁ