పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పూర్వకముగాఁ దనసంకల్ప మెఱింగించి యయ్యభిలాష తీర్పుఁడని వేఁడుకొనియెను.

ఆదయాళునకు వానియం దక్కటికము గలిగినది. ఒకమంత్ర యుపదేశముగావించి జపింపుమని విధానమంతయు నెఱిఁగించెను. అతండాకొండగుహయందే వేఱొకచోట వసించి యామంత్రము జపించు చుండెను. దృఢనిశ్చయునకుఁ గార్యసాఫల్యము గాకుండునా ?

నిద్రాహారములుమాని తదేకదృష్టిగా నామంత్రము జపించుచుండఁ బదిసంవత్సరములు గతించినవి. అప్పటి కొకదేవత ప్రత్యక్షమై నీ కేమి కావలయునని యడిగిన నతండు ఎనిమిదవసిద్ధియగు వశిత్వ మిమ్మని కోరికొనియెను.

అబ్బో ! ఎక్కడివశిత్వము ? ఈతపంబు దానికిఁ జూలదని పలికి యాదేవత యంతర్థానము నొందినది. వెండియు నతండు తపంబు సేయ మొదలుపెట్టెను.

మఱియైదుసంవత్సరములకు మఱల నాదేవత ప్రత్యక్షమై నీ కేమి కావలయునని యడిగి వెనుకటిరీతినే వశిత్వమును గోరుటయు నావేల్పీయఁజాలనని చెప్పిపోయినది. ఈరీతి నైదుసంవత్సరముల కొకసారి వచ్చి యడుగుచు నతండుకోరినది యీయఁజాలనని చెప్పిపోవుచుఁ జివరకు నలువదియేం డ్లత్యంతదీక్షతోఁ దపముసేసిన యామహీధరభట్టున కాదేవత కాకోరిక తీరుపక తప్పినదికాదు.

వశిత్వసిద్ధి లభించినపిమ్మట మహీధరభట్టునకు వైవాహికాభిలాషయంతయు నుడిగినది. అస్థిరములని తెలిసినపిమ్మట మహాత్ములు తుచ్ఛభోగముల నభిలషింతురా ? అతిప్రయత్నమునఁ గాశికింజని గంగఁ దెచ్చి తోటకూరమడిలోఁ జల్లువెంగలి యుండు నా ? అతండు భక్తిజ్ఞాన వైరాగ్యములతో నాత్మవేత్తయై గిరిశిఖరంబున నీయుపవనంబు గల్పించుకొని మృగము లూడిగములుసేయ నీవటవృక్షముక్రిందనున్న పర్ణశా