పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నలువదియామడయున్నది. ఆనడుమనున్న యేమెకమైన మనుష్యులజోలికిరావు. బాబో ! ఆయన ప్రభావము సెప్ప నాతరముకాదు. ఎప్పుడు పర్ణశాలలో ముక్కు మూసికొని శపముజేసికొనుచుండునని గొప్పగా వర్ణించుచుఁ జెప్పెను.

కుచుమారుఁ డత్యుత్సాహముతో నాకథవిని యోరీ ! ఆయన పేరేమియో యెఱుంగుదువా? ఇప్పుడున్న వాఁడా అని యడిగిన వాఁడు సామీ! పేరు నాకుఁదెలియదు. మాబోఁటులతో మాటలాడునా ? మే మేదేని యాపదవచ్చినప్పుడు ఆయనఁ దలఁచికొని మీదులు గట్టుదుము. మాకోరికిలు తీరుచుండును. అందుఁబోయి మ్రొక్కులు చెల్లించుకొందుము. మే మేది తీసికొనిపోయినను వారి గుడిమ్రోల నిడవలసినదే. దాని నాయన చూడనేచూడఁడు. నిరుడు మాపల్లెనుండి మ్రొక్కులు తీసికొనిపోయిరి. అప్పటికి బ్రతికియున్నవాఁ డని యెఱింగించెను.

కుచుమారుని కతనిఁ జూడవలయునని మిక్కిలి యుత్సాహము గలిగినది. ఆతనిగుఱించి పలుమా రడిగినమాటయే యడుగుచు వాఁడు సెప్పినమాటలఁబట్టి యాసిద్ధుండు మహానుభావుండని నిశ్చయించెను. మాగన్‌మడిగి తెలిసికొని మఱునాఁ డుదయకాలంబున బయలుదేరి యాదారిఁ బోవుచుండెను. తేనె ఫలములు దుంపలు లోనగు పదార్థములుదిని యాకలి యడంచుకొనుచుఁ బదియేనుదినములు నడిచి గురుతుగా సిద్ధాశ్రమమున కరిగెను.

వృక్షలతాగుల్మాదులు వాడియున్నవి. ఫలములు రసహీనములై యెండిపోవుచున్నవి. కుసుమములు వాసనాశూన్యములై రాలి పోవుచున్నవి. పూర్వము మిక్కిలి శోభాస్పదముగా నున్నదని చూచిన వారికిఁ దోఁచకమానదు. కుచుమారుం డాగురుతులు పరికించి కోయవాఁడెఱింగించిన సిద్ధవన మదియేయని నిశ్చయించి విశేషములు