పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కుబేరుండొక నెపంబున సంవత్సరము భార్యతో వియోగము గలుగునట్లు మా బావనుశపించెను. ఆశాపం బతికష్టంబున ననుభవించి సంవత్సరాంతమున నింటికివచ్చి యందుండ నిష్టములేక కాపుర మెత్తి వైచి భార్యతోఁగూడ భూలోకములో నొకానొక పర్వతకందరమున వసించెను. ఆ దంపతులు నన్నుఁగూడ రమ్మని నిర్బంధించిరి. కాని నా కిష్టములేక యందేయుండి సంగీతవిద్య నేర్చుకొనుచుంటిని. నా యసహాయత బరీక్షించి కుబేరుని వంటవాఁడొకండు తన్ను వివాహమాడుమని నన్ను నిర్బంధించెను. నేనుఁ గొంతచదివినదాన నగుట నామూర్ఖునిఁ బెండ్లియాడనొల్లక నాయసమ్మతిని దెలియఁజేసితిని.

అతం డంతటితో విడువక పలుమారు నన్నందులకై వేధింపం దొడంగెను. నాని నపరాధిఁగానెంచి కుబేరునికిఁ దెలియఁజేసితిని. మా కుటుంబముపైఁగల యీసునంజేసి యారాజరాజు నా మొరవిచారింపఁ డయ్యెను. ఆ బానిసకాని రాయిడికి నేనందు నిలువలేక మాయక్కయున్న యిక్క యెఱుంగక తలపోసి తలపోసి యొక వృద్ధయక్షుని యుపదేశంబున నీ శిఖరప్రదేశంబున కరుదెంచి యిందుఁగల యిందుశేఖరుని లింగం బారాధించుచుంటిని. నాఁటితుదినేఁటిదనుక మఱియే పురుషుండు నిందురాలేదు. నీ వుత్తమ బ్రాహ్మణుండవని తోచుచున్నది. చంద్రశేఖరుండు స్వప్నంబున సాక్షాత్కరించి నీకుఁ బండితుండు బ్రాహ్మణుండు భర్తయగునని యానతిచ్చియున్న వాఁడు. అమ్మహాత్ముని వాక్యమున కన్యధాత్వ మెట్లుకలిగెడిని ? నీవు పండితుండవేని నిన్ను బెండ్లి యాడెదనని పలుకుచు గొన్నివిద్యలలో నన్నుఁ బరీక్షించినది.

అన్నిటికిని సమాధానము చెప్పితిని. అప్పుడు మెచ్చుకొనుచు నామెడలోఁ బుష్పదామంబువైచినది. నాకప్పటియానందము శెప్పుటకుఁ దగినమాటలురావు. మహానందసాగరంబున మునింగి యయ్యంగన మెడలో వేరొకపుష్పదామంబువైచితిని ఇరువురము పూవులే తలం