పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణపది కథ.

167

వా. ఏతత్ప్రదేశం.

చిన్నది - కోవావిధిః

నేను - అఘటిత ఘటనాసమర్ధః పూర్వసుకృత మంగళవిధిః ........ అనియిట్లు మేము కొంతసేపు సంవాదము గావించితిమి. పిమ్మట నాకొమ్మ నాకతిథిపూజఁ గావించి భక్షింప ఫలములఁ దెచ్చియిచ్చినది. వానిందిని తృప్తుండనై విశ్రాంతివడసిన పిమ్మట నల్లన నామె యొద్దకుఁబోయి విషయముదోప నిట్లంటి.

దేవీ ! ఇది మనుష్య సంచారశూన్యంబైన దేవభూమియగుట నీ విందుండుటచే దేవకన్యవని తెల్లమగుచున్నది. సురగరుడోరగ విద్యాధరాధులలో నీవు జునించిన కులమెయ్యది ? నీ పేరేమి ? ఒక్కరిత వీ విందుండఁ గారణమేమి ? నీయుదంతం బెఱింగించి నన్ను నీకృపాత్రుం గావింపుము. పదిమాసములనుండి యీ యరణ్యములలో దిరుగుచుండెడి నాకు నేఁటికి సాఫల్యము గలిగినది. నేను గృతార్థుండ నైతిని మనుష్యులలో నధికుండవని నీవు నాతో సంభాషించుటచేతనే గర్వపడుచుంటిని. నా విద్యయు సఫలము నొందఁగలదని యత్యంత వినయవిశ్వాసములతో నడిగిన నా చిన్నది. మందహాసము గావింపుచు నిట్లనియె.

−♦ సువర్ణపది కథ. ♦−

భూసురోత్తమా! వినుము. నా కాపుర మలకాపురము నే నొక యక్షకన్యకను, నాపేరు సువర్ణ పదిక యండ్రు. మేమిరువుర మక్క చెల్లెండ్రము. మాయక్కపేరు రత్నపదిక. ఆమె భర్తతో నలకాపురంబునఁ గాపురము సేయుచుండ నే నామెయొద్దనే పెరిగితిని మేమిద్దర యొక మునివలనఁజనించితిమఁట మాతల్లి నా చిన్నతనమునందే మృతినొందినదిగమా యక్కయు బావయు నన్ను గారాబముగా బెనుచు చుండిరి.