పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అప్పుడతండు శారికం జీరి నీవు ముందుగా రుక్మిణియంతఃపురమున కరిగి పండితునొకని వెంటఁబెట్టుకొని నేనక్కడికి వచ్చుచున్నాననియుఁ జారుమతిని రుక్మిణిని ముందరిచావడిలోఁ గూర్చుండమనియుఁ జెప్పుము. పొమ్మని దానినంపి తాను దత్తునిమాత్రము వెంటనిడికొని యారాజపుత్రుఁడు రుక్మిణియంతఃపురమున కరిగెను

రుక్మిణి శారికవలన నావార్తవిని యన్నను ముందరిచావడిలోఁ గలిసికొని నమస్కరించినది. అతండత్యంత సంభ్రమముతోఁ గాశినుండి మఱియొక పండితుఁడు వచ్చెను. చారుమతి యతనితోఁగొంచెము ప్రసంగింపవలసియున్నది. ఆసుందరి యెందున్నది? అనియడిగిన నప్పడఁతి విన్ననగు మొగంబుతో నన్నా ! నీవు పలుమారాచెలువను గుఱించి వితర్కించుచుంటివని తెలిసి యామె యిందునిలుచుటకు వెఱచి నిన్న నుద్యానములోనుండియే నాకుఁజెప్పక యెక్కడికోపోయినది. తిరుగా నాలుగుదినములలో రాఁగలదు. వచ్చినతోడనే నీకుఁదెలియఁజేసెదనని చెప్పుచుండగనే యారాజపుత్రుని మొగము వెలవెల బారినది. ఒక్కింతసేపు ధ్యానించి చాలు చాలు రుక్మిణీ ! దాని కీటక్కులు నీమూలముననేవచ్చినవి సభలలోనాడెడు వెలయాలికి నంతఃపురవాసమేల? నీకతంబునంగానిదానిబలవంతముననైనఁ దీసికొనిపోకుందునా? విద్వాంసురాలనియుఁ బండితులతోఁ బ్రసంగించునని వేడుకపడి పలుమారు తత్ప్రసక్తిఁ దెచ్చితిని. లేకున్న దానిగొడవనాకేల? ఈసారి వచ్చినవెంటనే నాకుఁ దెలియఁజేయవలయుం జుమీ? తప్పితివేని నాయానయని యొట్టుబెట్టి యామెచేననిపించుకొని మొగసాలనిలువంబడియున్న దత్తునితో నావర్తమానముజెప్పి నిజనివాసంబున కఱిగెను.

దత్తుఁడు రాజపుత్రా ! ఆకనికగాత్రి వచ్చినవెంటనేవత్తు నాకిప్పుడనుజ్ఞయిమ్మని యడిగిన నతండు చాలు చాలు. నిన్నుఁ బోనీయను. దానిరాకయెప్పుడో దెలియదు. సర్వదా నీవు నాయొద్ద నుండవలయు