పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

157

యంతఃపురమునకువచ్చి యడిగిన సంగతుల జ్ఞాపకము చేసికొనుచు జారుమతివేషముతో నాపురుషుఁడు తన్నుమోసముచేసెనని నిశ్చయించుకొని యతని మొగము పలుమారు చూచిచూచి యా నిశ్చయము దృఢపరచుకొని సంతసము పట్టఁజాలక గుభాలున నతనిచేయింబట్టుకొని అమ్మ నేజెల్ల? చారుమతీ ! నన్నెంతమోసము జేసితివి? నీ మాయలన్నియు నాలోచించుచునే మాటాడుచుంటిని. దొంగతనము బయలైనది ఇఁకనీగుట్టుదాగదు అంతయు నేనేచెప్పెదవినుఁడు మీరు నా గుఱ్ఱమెక్కి యాఁడువేషముతో నాయుద్యానవనమునకు వచ్చితిరి. నాఁటనుండియుఁ దెలియకుండ మెలఁగితిరి. ఇఁక నిలువలేక బయల్పడిరి. మీరు రేవతితోఁ జెప్పినట్లుగా స్త్రీవేషము వై చికొని యాతోటకు వచ్చితిరి. చారుమతియనుకొని భ్రమసితిమి. ఇక్కడ మీకపటమంతయు నభినయించితిరి. తెలిసికొంటినా! ఇఁక నాకువెఱపు లేదు. చనువుగలిగి యున్నవారగుట నాయిష్టమువచ్చినట్లు మాట్లాడవచ్చును. అమ్మా! నా గుట్టులో మీగుట్టుచెప్పరా! అనిపలికి యతనిం గౌఁగిలించుకొన్నది.

అతండును తమినిలుపలేక తదనుగుణక్రీడా విశేషములచే నమ్మదవతిని నానందసాగరమున ముంచివై చెను.

సీ. ఇది లతావేష్టితం బిది క్షీరనీరంబు
                  నమితక స్ఫురితక సమము లివియ
    యిది యర్ధచంద్రిక యిది శశప్లుతకంబు
                  మణిమాల యిది బిందుమాలయిదియ
    యిది భుగ్నకంబిది యింద్రాణికముపిడి
                  తకవేష్టితక సంపుటకము లివియ
    యిది వృషాఘాతకంబివి మంధనవరాహ
                 ఘాతనిర్ఘాత ప్రేంఖతకములు.

గీ. భ్రమరకంబిది సందంశ భావమిదియ
    యిదియ స్తనితంబు కూజితంబిదియ రుదిత