పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

దేవీ ! యాచతురుండు నన్ను వేపి వేపి చివరకు యధార్ధము జెప్పెను. చారుమతిమాట యేమియుఁ జెప్పలేదుకాని తాను స్త్రీవేషముతో నీయుద్యానవనమున సాయంకాలమున వచ్చుటకంగీకరించెను నన్ను ద్వారమునొద్దఁ గాచిగొనియుండుమనియెను. ఈచిత్రఫలక మతనిదే. స్పష్టముగాఁ జూచితినని యాకథయంతయు నెఱింగించిన మేను పులకింప నా కురంగనయన వేళయైనది. నీవు గుమ్మముదాపునకుఁ బోయి కాచికొనియుండుము. నీవు లేకున్న జిక్కు పడఁగలఁడు. క్రొత్త వాఁడుగదా.? యని రేవతికి నియమించి యతండువచ్చిన తరువాతఁ దాను గావింపవలసిన కృత్యములగుఱించి యాలోచించుచుండెను.

రేవతియుఁ దోటగుమ్మముదాపునకుఁబోయి యతనిరాక కెదురుచూచుచుండెను. సూర్యుండపరగిరిశిఖర మలంకరించు సమయమున నొకరమణీమణి యాద్వారముదాపునకు వచ్చినది.

ఆయువతీమతల్లినిఁ జారుమతిగాఁ దెలిసికొని రేవతి యబ్బురపాటుతో నోహో ! మోహినీ! క్రొత్తదానవువలెఁ జంకుచుంటివేమి? నెందుబోయితివి. రాజపుత్రిక యిందేయున్నది. రమ్ము. నీవియోగమున మిక్కిలి పరితపించుచున్నదని పలుకుచుఁ జేయిపట్టుకొని లోపలీకిఁ దీసికొనిపోయి రుక్మిణికడఁ జేర్చినది.

రుక్మిణి యాముద్దియంజూచి దద్దరిల్లుచు నద్దిరా! మాపుణ్యము సఖీ ! నన్నెంతమోసము జేసిపోయితివి ! యీనాలుగుదినములు దుదిన్‌నములైనవిగదా ? యని పలుకుచు గాఢాలింగనము జేసికొని మంచముపైఁ గూర్చుండఁబెట్టికొని యెక్కడికిఁబోయితివో చెప్పుమని గట్టిగా నిర్భధించుటయుఁ జారుమతి నవ్వుచు జవ్వనీ ! నేనిఁక నీకడ నుండనోప. మీయన్న నన్నుఁగన్నది మొదలు మదనవేదనంబొదలుచు ననేకవార్తల నంపుచున్నాడు. ఆప్రమాదమెఱిఁగి నీ కెఱిఁగించిన బోనీ