పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

151

పరి – మిమ్మాకొమ్మ మాభర్తృదారిక యంతిపురికిఁ దీసికొని వచ్చి విడువలేదా ?

ద — విడిచినదేమో జ్ఞాపకములేదు.

ప - అబ్బా! మీకునమస్కారము నిజమేదియోయెఱింగింతురు!

ద -- ఎఱింగించిన ఫలమేమి?

ప -- ఫలము చూపుదును కాదా !

ద -- దారితప్పి మీయంతఃపురమునకు వచ్చితిననుకొనుము. అందుల కేమంచువు ?

ప - మఱల నామెకొకసారి నేత్రపర్వము గావింపుమని.

ద - అది యెట్లుశక్యము ?

ప -( చెవిలో) ఇటునటుయని యేదియోజెప్పినది. అతండంగీకరించెను. పరిచారిక యతని యనుమతివడసి యతఃపురమున కరిగి యావృత్తాంతమంతయు రుక్మిణి కెఱింగించినది.

రుక్మిణియుఁ బరిచారికయగు రేవతిచెప్పిన మాటలు విని పర మానంద సంభృతహృదయయై మనోహరమణిభూషాంబరధారిణియై నాఁటిసాయంకాలమునఁ బెందలకడ నశ్వశకటమెక్కి రేవతి తోడరాఁ గేళీవనంబున కఱిగినది భర్తృదారిక నేఁడు వేగమువచ్చినదని తొందరపడుచు వనపాలికలు పీఠాదికముల సవరింప వారిదెసంజూడక నితర విశేషము లేవియు బరిశీలింపక నాచంపకగంధి తిన్నగాఁ గేళీసౌధంబునకుంబోయినది.

పుష్పపాలికలు మాలికలుగుత్తులులోనగు పూవుటెత్తులఁ గాను కలగాఁ దీనికొనివచ్చి మూఁగి యందీయుఁడు నందుకొని వారినందఱ దూరముగాఁ బోవునట్లు పనులునియమించి రేవతితో సౌధాంతరమున వసించి యేకాంతమాడుచు నాపురుషునితో నేమనిచెప్పితివి? ఏమని యుత్తరమిచ్చెను ? మఱలనొకసారి చెప్పుమని యడిగిన నాపడఁతి యిట్లనియె.