పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

149

కథవిని కనుబొమ్మలెగరవై చుచు ఆ ! ఏమీ ! ఆగణిక యంతనిపుణికయా? వేశ్యలకు వ్రతముకూడనా? ఔ'రా! ఎంతచోద్యము వెలయాలట పురుషులఁజూడదఁట మీరుదాని టక్కులలోఁ జిక్కితిరి. సీ ! సమయమునకుఁ బనికిరాని మీచదువేమిటికి ? అనిమిత్రు నాక్షేపించుచు రాజపుత్రా ! నీవిఁకకుందకుము. రేపురాతిరికి నానాతి నీశయ్యఁజేరునట్లు చేసెదను నాప్రజ్ఞజూడుము అనుటయు నతండు తటాలున లేచి వచ్చి దత్తునిగౌఁగిలించుకొని వీఁడు నీమితుఁడు కనికరింపఁ బాత్రుడు. సిగ్గువిడిచి చెప్పుచుంటిని. ఆవాల్గంటి కంటికిఁగట్టినట్లు సర్వదా కనఁబడుచుండును. నీవిప్పుడాడినమాట జెల్లించుకొని నీయాప్తుని బ్రతికించు కొమ్ము అని వేడికొనియెను.

దత్తుఁ డతనిమంచముపైఁ గూర్చుండి యతనిచేయిఁ బట్టుకొని యుపలాలించుచు మిత్రమా ! నీవాత్రపడకుము. అయ్యంబుజనేత్ర నొకసారి నాకగపడునట్లుచేయుము . నీకోరికదీర్తునని చెప్పెను రాజపుత్రుఁడాలోచించి యొకచీఁటివ్రాసి చెల్లెలియంతఃపురమునకుఁ బంపెను. దానికిఁ బ్రత్యుత్తరమిట్లు వచ్చినది. సహోదరా! క్రొత్త పండితునితో బ్రసంగింప జారుమతిం బంపమని వ్రాసితివి. ఆయన్నుమిన్న మొన్నటినుండి కనంబడుటలేదు. ఆసుందరి యెందుఁబోయినదో తెలియకున్నది. వచ్చినవెంటనే పంపఁగలను. ఇట్లు మీప్రియసహోదరి రుక్మిణి.

రాజపుత్రుఁ డాయుత్తరముచదివి నాలుకగోసిన మూగవలె మాటాడక దత్తునిమొగము జూచెను. అతండతని దైన్యము గ్రహించి రాజనందనా ! మిమ్మాసుందరి వెఱపించుటకు నందే డాగియుండును. ఎందుబోఁగలదు? నేఁడుగాకున్న రేపాయెను. మేమిందేయుండెదము గదాయని పలికినఁ జిత్రసేనుఁడు ఇది నాప్రారబ్ధముకాఁబోలు. అనివగచుచు వచ్చుచు బోవుచుండుఁడని చెప్పి వారినెలవున కనిపెను.

గోణికాపుత్రుండు దత్తునితనబసకుం దీసికొనిపోయి చారుమతి