పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

తలఁచెదను. నేనువేశినశంకలన్నియు నదిసమాధానము చెప్పినది. దాని శంకలు నాకుసులువు గానే బోధపడిసవి. మావాదమున జయాపజయంబు లెవ్వరును నిరూపింపకలేకపోయిరి. అది నన్ను నేనుదానిని స్తుతియించుచు నంతటితో సభముగించితిమి. మిత్రమా ! దానిమొగము జూడ నీమొగముజూచినట్లే యున్నది. పెక్కేల ప్రసంగము గూడ యుక్తిప్రయుక్తులతో నీవుచేసినట్లేచేసినది. రాజపుత్రునకు దానివిద్యా ప్రౌఢిమజూచినతరువాత మఱియు విరహపరితాప మధికమైనది. మఱునాఁడు నేనుబోయినంత ఆర్యా! మీరన్నకార్యము తీర్చితిని. ఇఁక నా కార్యము గావింపవలయును. ఏమితంత్రమాలోచించితిరి? అనియడిగిన నేను నిట్టూర్పునిగుడించుచు రాజపుత్రా ! అయ్యంబుజనేత్ర నాతంత్రములకు లోఁబడునదికాదు. ప్రతితంత్రములు దానికిఁ దెలియును. నా మిత్రుఁడు దత్తుఁడనువాఁడు నేఁడో రేపో రాఁగలఁడు అతండుమంచి ప్రౌఢుండు వాఁడు తృటిలో వశవర్తినిఁ జేయఁగలఁడని చెప్పితిని. అతండు నీయాగమన మభిలషించుచున్నాఁడు దైవికముగ నేఁడేవచ్చితివి ఇదియేనావృత్తాంతము. ఈకారణమున రాజపుత్రునితో మైత్రిగలిసినది. గడియగనంబడకపోయితినేని పదివర్తమానములు పంపును. చాల మంచివాఁడు చూతువుగాని రమ్ము. అనిపలికి గోణికాపుత్రుండు దత్తుని లోపలికిఁ దీసికొనిపోయి రాజపుత్రునకుఁజూపుచు నితఁడే నామిత్రుఁడు దత్తుఁడు అని యతనియాగమనప్రకారమంతయుఁ దెలియఁజేసెను,

అప్పుడు రాజపుత్రుండు విస్మయముతో లేచి నమస్కరించుచు మహాత్మా ! మీప్రభావ మిదివఱకే వినియుంటిని. మీదర్శనమైనది. నామనోరధము సఫలముగాఁగలదు. నన్నుమిత్రునిగాఁ బుత్రునిగా భావించి కాపాడుము కడమసంగతులన్నియు నీతఁడే యెఱింగించును. అని పలికి శయ్యపైఁ బండుకొనియెను. తరువాత గోణికాపుత్రుఁడు వెండియు చారుమతివృత్తాంతమంతయు నతనికెఱింగించెను. దత్తకుఁడా