పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢాకీనీదేవతకథ.

141

నకులునకులేదనిచెప్పఁగలను. ఎప్పుడునేర్చెనో తెలియదనిపలికినవిని బండివాఁడు కత్తిక్రిందబెట్టి చేతులుజోడించుచు మహాత్మా! నేనేసాధనము నెఱుఁగను. బండితోలుటతప్ప వేరొకపని నాచేతగాదు నేనువట్టి పిరికివాఁడను రాజభటులఁజూచి గజగజలాడుచుందును. అదియేమి మహిమయో తెలియదు మీకట్టులువిప్పినప్పుడే నామేననేదియో యావేశమైనది. మీరాయోగినిపైకురికినప్పుడు, నామేను పొంగిపోయినది. ఏనుగంతబలమువచ్చినది. తటాలునఁబోయి యందున్న కటారింగైకొని గిరగిరదిరుగుచు నాభటునెట్టువ్రేసితినో యెఱుఁగను. ఇప్పుడే నాయావేశముడిగినది. నేజేసినపనితలంచికొన నాకే యబ్బురముగా నున్నదని యాశకటచోదకుఁడు చెప్పెను.

అప్పుడు చిత్రసేన గోణికాపుత్రునితో నార్యా ! మీరుమాత్రము కత్తిసాధనముచేసియున్నారా! యోధులపైఁబడి యెట్లుపరిమార్చితిరి ? ఇది వింతగానున్న దే యనియడిగిననతండు ఇది మదియాభీష్ట దేవత నారసింహ ప్రభావంబుగాక యొండుగాదు. నన్నువాండ్రుగట్టి నప్పుడే సకవచంబుగా నరసింహమంత్రంబు జపించితిని అమ్మహాత్ముండావేశించి మాచేనిట్టిపనిగావింపఁజేసెనని యెఱింగించెను. పిమ్మట వారుమువ్వురు నొండొరుల నూరడించుకొని యాయమ్మవారిగుడికిఁబోయి యెదురనిలువంబడి చేతులుజోడించి పెక్కువిధంబుల స్తుతియించిరి. అందుమఱియు గోణికాపుత్రుఁడు

శా. దేవీ ! నీనికటంబుసేరుటఁ గడుందీర్పంగ రానట్టి మా
    యావళ్లెల్లఁ దొలంగె నిప్పుడు ప్రహపాన్ పారవారాశిడో
    లావీచీతతి నూగుచుంటి మహితుల్ పంచత్వముం బొందిరం
    బా ! విశ్రాంతిగ నీదురూపమిటఁ ప్రత్యక్షంబుగాజూచి సం
    సేవింపందొరకొన్న మాకిచట నేసిద్ధుల్ ప్రసాదింతువో ?

అని భక్తివివశుఁడై కన్నులుమూసికొని ఢాకినీదేవత ననేక