పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢాకీనీదేవతకథ.

139

అని యెడమచేతితోఁ దచ్ఛిరోజములు బట్టి లాగుటయు నయ్యోగిని పెద్దయెలుంగున చచ్చితి చచ్చితి నన్ను జంపుచున్నారు. రండోయని రాజకింకరులగుఱించి యాక్రోశించినది.

అయ్యాక్రందనము విని యనతిదూరములో జత్రసేనను బలవంతపెట్టుచున్న రాజభటులు పటురయంబు శక్తి గుడి నికటంబున కరుదెంచిరి. వారింజూచి గోణికాపుత్రుండు యోగినినివిడిచి మదపుటేనుగపైగవియు సింగంబు కొదమయుంబోలె గరవాలంబు నవలీలఁ దిప్పుచు ముప్పిరిగొను కోపముతో గుప్పనవారిపై కురికెను. తోడనే బండివాఁడును రెండవవానిపయింబడియెను.

నిరాయుధులగు నాయోధు లాయసిథారులకువెఱచి యందు నిలువక వెన్నిచ్చిపరవఁదొడగిరి. వారాబంటుల విడువక వెన్నంటి తరిమికొనిపోయి నూఱడుగులలోఁ గలిసికొని యసిధారల వారల తలల నరికివైచిరి. రాజప్రణిధులు శమనలోకాతిధులైనవెనుక గోణికాపుత్రు డాప్రాంతమందు వెదకి యొడలెఱుఁగక యొకచో నేలంబడియున్న చిత్రసేనంగాంచి శోకగద్గదకంఠుండై కలకంఠీ ! లెమ్ము లెమ్ము. దైవము నీయిక్కట్టుతొలగించెను. శత్రువులు నాశనమైరి. నేను నీమిత్రుండ గోణికాపుత్రుండని పిలిచినంత నమృతమువర్షంచునట్లు మురియుచు బోగముపట్టెయట్టెలేచి యతనింగౌఁగలించికొని మహాత్మా! ఎట్లువచ్చితివి ? శత్రువులెట్లుహతులైరి ? అయ్యో ! మనకెట్లు చిక్కుదినములు వచ్చినవి. మమ్మందుఁగట్టి నప్పుడే మాకు దెలివిదప్పినది. రతిమంజిరిని శక్తికిబలియియ్య యోగినికప్పగించి యాపాతకులు నన్నుదూరముగాఁ దీసికొనివచ్చి మచ్చికగా నేమేమో ముచ్చటించిరి. కాని యామాటలేమియు నాజెవింబడ లేదు. వివశనైపడిపోయితిని. ఇప్పుడు మీమాట వినినంత స్మృతివచ్చినని. నాముద్దుచెల్లెలు బ్రతికియున్నదా? అనియడిగిన గోణికాపుత్రుండు దానికిపెద్దగండము దాటినది. శక్తికి