పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నన్యాయము జరగుచుండఁ గన్నులారఁజూచుచుండట నీతీయా ? అని వానికి జాలిపుట్టునట్లు పన్యసించిన విని యాబండివాఁడు సాహసముతో నాతనికట్టులన్నియఁ ద్రెంపి పారవైచెను.

అప్పుడు గోణికాపుత్రుఁడు బండివాని వెంటఁబెట్టికొని వీరావేశముతో నారసింహమంత్రము జపించుచు నాఢాకినీదేవిగుడి దాపునకుఁ బోయెను.

విశాలశాఖలచే దిగంతములనావరించిన వటతరువుక్రింద పృధుశిలానిర్మితమగు నాలయములో ఢాకినీదేవి యొప్పుచున్నది. నాలుక జ్వాలికవలె వ్రేలాడ దంష్ట్రాకరాళవదనయగు నాదేవివిగ్రహము చూచువారికి వెఱుపుగలుగక మానదు. మెడఁ గపాలమాలికయు హస్తంబుల ససిగదాతోమరాద్యాయు ధంబులును వెలయ సింహాసనమున నాసీనయై యొప్పుచుండెను.

శక్తి గుడిమ్రోలనున్న నేలయంతయు నరులచే బలులొసంగిన జంతువులరక్తముచే సిక్తమై యట్టకట్టఁబడి యున్నది. మఱియు నట్టిఢాకినీదేవి కట్టెదుటఁ గాలుసేతులుగట్టఁబడి మెడనుగట్టినవేపరొట్ట మోము దమ్మికి మెత్తనిపానుపై యొప్ప సాష్టాంగముగాఁ బండుకొనఁ బెట్టిన రతిమంజరియు రతిమంజరికంఠము త్తరింపఁ గత్తిపైకెత్తి శక్తిదెస దృష్టులు వ్యాపింపఁజేసి ధ్యానించుచు నేయగమకించు మతంగయోగినియు వారి కన్నులఁబడిరి.

అప్పుడు గోణికాపుత్రుఁడు రౌద్రావేశముతో నొడలెఱుఁగక నారసింహము జపించుచు నొక్కడుగులోఁబోయి యోగినియెత్తినకత్తి నట్టెపట్టుకొనిలాగి యోసీ ద్రోహురాలా ! యెంతపనిచేయుచుంటివి ? నీవంటి పాపాత్మురాలెందైనంగలదా? నీవెత్తిన కత్తియే నీకుమిత్తియైనది. నీవారాధించినదుర్గకే నిన్ను బలియిచ్చుచుంటిని. నీయభీష్ట దేవతల స్మరించుకొనుము.