పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢాకీనీదేవతకథ.

137

పొందుగాంచి యానందింపుఁడు రెండవదానిని నాకిండు అమ్మవారికి బలియిచ్చి కోరికలఁబడసెద నిట్లుచేయుఁడు. అని యేమో బోధించిన వాండ్రు తలయూచి యాలోచించి చిత్రసేనసోయగము దలంచి యనుమోదించిరి. వాండ్రు మీసములుదువ్వుచు బండిదగ్గిరకువచ్చి బాపనోడా ! యీ యాఁడువాండ్రు మువ్వురు నీదాపుననున్న యమ్మవారి గుడికిఁబోయి వత్తురు. బండివాఁడును నీవు నిందుండుఁడు.

వారు వచ్చినతరువాత నవ్వలపోవుదమని పలికిన గోణికాపుత్రుండు మేము మాత్రమురాఁగూడదా? ఢాకినీదేవిమాకు సేవ్యురాలు కాదా! అని యడిగిన కింకరులు మగవారందుఁ బోరాదు మీరిందే నిలువవలయుననుటయు నతండు మీరు మగవారుకారా ? మీరెట్లు పోయెదరు? అని యడిగెను.

బాగు బాగు. మాకాజ్ఞాపింప నీ వెవ్వఁడవు ? పాఱుఁడవుగదా యని సంకెళ్లువైవక విడిగాఁదీసికొనిపోవు చుండఁ బొగరెక్కిపోయితివే మేము కావలివారము పోవచ్చును. మీరు రారాదు. నిలునిలుమని పలుకుచు నదలించి గట్టిత్రాళ్ళచే నతని నొకచెట్టునకుఁగట్టి కదలకుండ బారిపోవకుండ జూచుచుండుమని బండివానికి నియమించివాండ్రాయాఁడువారిం దీసికొని యమ్మవారి గుడియొద్దకుఁ బోయిరి.

పిమ్మట గోణికాపుత్రుండు బండివానితో నోరీ ! యారాజభటులు కడుదుర్మార్గులు. ఆసుందరుల మానభంగముగావింప మనల నిందునాపి వారిందీసికొనిపోయిరి. మనయెదుట నక్రమముజరగుచుండ నూరకుండుట ధర్మముగాదు. నీకుమాత్రము ధర్మాధర్మ వివేచనము లేదా? నీవు జూచుచునేయుంటివి. ఆబాలిశులు యోగినియు గుజగుజ లాడుచు, గపటముచేయుచుండలేదా! నీవిప్పుడొకయుపకారము సేయ వలెను. నాకట్టుల విప్పుము. మనమిరువురముపోయి వారినదలింతము. గ్రుక్కెడుప్రాణము లెప్పుడుపోయినను పోవునవియేకదా. అబలలకు