పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సెలవిచ్చెను. బాలకునితోఁగూడ వారింటికి బోయి బాలునకు దృష్టి దీసి పండుకొనబెట్టిరి. అంతలోఁజింతామణి యచ్చటికివచ్చి యావృత్తాంతమంతయువిని ముక్కుపై వ్రేలిడికొనుచు మాతంగుడా! ఎంతపని చేసితిరా ? అసిపలికిన వాఁడు అమ్మా ! మేము మొదట జడిసితిమి కానిరాజుగారు నాకుమారుని మెచ్చుకొని కానుకలిచ్చిరి. చూచితివా! ఇదియంతయు నీ యనుగ్రహమనిపలికి యానందించుచుండెను.

మాతంగదంపతులు పుత్రప్రేమదలంచి చింతించుచు, యతి సత్తముని బంధవిముక్తనిదలంచి సంతసించుచుఁజింతామణి యా బాలుఁ డెందున్ననాఁడని యడిగిన మాతంగి అమ్మా ! మా కుమారుఁడుగొప్ప కానుకలదెచ్చెనని మా పల్లెవాండ్రందఱు కంట్రగించుచుఁ జూడ వచ్చుటం జేసి దిష్టితగిలి మేనికివేకిసోకినది దిగదుడిచితిమి. ఆగుడిసిలోఁ బండుకొనఁ బెట్టితిమి నిద్రించుచున్నాడని చెప్పినవిని చింతామణి తొందరగా లోపలికిఁబోయి బాబూ ! 'బాబూ ! నిద్రించుచుంటివా ! అయ్యో ! యెక్క డినిద్ర యోగనిద్రయా యేమి ! మాటాడవేమి ! అనియెంతపిలిచినను బలుకలేదు.

మహాత్మా ! స్వస్వరూపము వహించితివా! అకటా! నీవలన మంచి మాటలు వినవలయునని యెంతయో యాసతో నుంటిని. ఈ కంటకురాలితో నిఁక మాటాడవా అని దుఃఖించిన విని మాతంగదంపతులు అట్లడలుచుంటివేల? ముద్దులనాయన లేవలేదా? అని యడుగుటయుఁ జింతామణి తెలిసినదైనను గన్నీరుగార్చుచు నింకెక్కడి ముద్దుల నాయన మీనాయన పరమపదించె. వానిచే నేదియు స్వీకరింప వలదని చెప్ప లేదా? రాజువానికిచ్చిన కానుకలేలపుచ్చుకొంటిరి? మీ బుణముతీరిపోయినది. వానిదారివాఁడు పోయెనని చెప్పినది.

గుండెలు బాదుకొనుచువచ్చి యాచండాలదంపతులు వానిఁ జాచి గతాసుండగుట తెలిసికొని వానిపయింబడి పెద్దయెలుంగున