పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

131

యని యడిగిన నేమియుమాటాడక శిరఃకంపమునఁ నంగీకారము సూచించెను.

నీవేమి చదివికొంటివి? యుపాధ్యాయుఁ డెవ్వడు? అనియడిగిన నాబాలుఁడేమియు మాటాడక యూరకుండెను. ఏమియుఁజదువుకో లేదని వానితండ్రి సమాధానము సెప్పెను.

రాజు - మాతంగా ! నీకుఁ బిల్లలెందఱు?

మాత - దేవా ! వీఁడొక్కడే. సింతామణికృపచేఁ గలిగెను

రాజు - చింతామణి యెవ్వతె?

మాత - బోగమామిడ. మా తెలిసినది బాబూ!

రాజు - ఏమి సెప్పినది ?

మా - ఎవ్వడో రుసి గంగలో సెపము చేసికొనుచుండగా మండువేసవిని పాదరచ్చలు దారిలోనుంచమని చెప్పినది. అట్టుసేసితిని వీఁడుగడుపునఁబడియెను.

రాజు - వీఁడు మాంసము తినునా ?

మా - దేవా! మాంసముగాదు అన్నమునుతినఁడు పాలు ద్రాగడు సింతామణిగారే పాలు పండులు తెచ్చి పెట్టుచుండును. తండ్రి! ఇంతే సత్తెము.

ఆమాటలువిని యారాజు మిక్కిలి విచారించుచు నప్పుడపసిండి పళ్లెరమున వేయుదీనారములు బోసికొని యాబాలునకుఁ గానుకగా నర్పించుచు బాలకా ! వీనినీకుఁ బారితోషికముగా నిచ్చితిని నీవురాత్రి గస్తుతిరిగినందులకు గైకొనుమనిపలికి యర్పించుటయు నామాణవకుఁడు ఆపళ్లెరము రెండుచేతులతో గ్రహించి అమ్మా! వీనినేను మోయఁజాలను గైకొనుమని పలుకుచు వారికందిచ్చెను.

చండాలదంపతులు పరమానందభరిత హృదయులై యాపళ్లెరమందుకొని మొహిరీల మూటగట్టుకొనిరి రాజు వారికింటికి బోవుటకు