పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

125

యించి మాన్యమువోవునని విచారించుచు నవ్వలికిఁబోయి మగనిజాడ చూచి కేకవెట్టుచు మరల నింటికి వచ్చుచు నించుకసేపు కూర్చుండి యంతలోలేచి పొరుగింటికేగి చూచుచు నడుగుచుఁ దొట్రుపడుచుండెను. ఆయారాటముజూచి యాబాలుండు అమ్మా ! నేఁడు నీవిట్లు బాబాకొఱకుఁ బరితపించుచుంటివేల ? నేఁడురాకున్న రేపురాడా? అనియడిగినఁ బుత్రునెత్తుకొని ముద్దాడుచు మాలిని నాయనా! నీతండ్రి నేఁటిరేయి నీవీటిలో గస్తుతిరుగవలసి యున్నది. ఏకారణముచేతనో రాలేకపోయిరి. మూఁడుతరములనుండి గస్తుమాన్యము మనకు జరగుచున్నది. నేఁడాపనిచేయకున్న నామాన్యములాగి కొందురు. అందులకై విచారించుచుంటినని యావృత్తాంత మెఱింగించినది.

పిల్లవాఁడు - అమ్మా ! గస్తు అననేమి ?

తల్లి --- బాబూ ! ప్రజలు నిద్రించుచుండ రాత్రి నాలుగు జాములు నాలుగువీధులకుంబోయి డప్పువాయించుచు నింటిలో దొంగలుదూరి వస్తువులు దొంగిలింతురు. జాగ్రతగా మేలుకొనియుండుఁడో యని కేకపెట్టవలయును. దీనికే గస్తు అనిపేరు.

పిల్లవాఁడు - తల్లీ ! ఈమాత్రముపని నేనుజేయలేనా ? నన్ను నియోగింపరాదా ! విచారించెదవేమిటికి ?

తల్లి - అయ్యో! తండ్రీ! నీవిదివఱకిల్లు కదలియెఱుఁగవు చీఁకటిలోఁ గ్రొత్తవీధులకుఁబోయి ప్రజల నెట్లు ప్రబోధింతువు ? జడిసి కొంటివేని భూతములు సోకును మాన్యముపోయినం బోవుగాక నీకా పనివలదు.

పిల్లవాఁడు - అమ్మా ! నాకేమియుభయములేదు. డిండిమము వాయింపఁగలను. ఏవీధులకుఁబోవలయునో గురుతులు సెప్పుము పోయెదంగాక.

తల్లి — పట్టీ ! నీకట్టియూహ యుండినచో డప్పుతీసుకొని నీ వెంటవచ్చి వీధులం జూపెద బిగ్గరగాఁ గేకవేయఁగలవా