పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గూర్చుండుటయు బ్రాకుటయు దప్పటడుగులిడుటయు మాటాడుటయు లోనగు బాలక్రీడల జూపుచుండ నమ్మాతంగదంపతులు బ్రహ్మానందము చెందుచుండిరి. ఆశిశువునకు యుక్తకాలమున నన్నప్రాశనము చేయ వలయునని తలంచిరి. చింతామణియాలోచించి బాహ్మణగృహంబు నుండి పాయసము దెచ్చిపెట్టినదికాని యామాణవకుఁడు నోరెత్తడయ్యెను.

అయ్యాశయముగ్రహించి చింతామణి వానికిఁ బండ్లుపెట్టనలవాటుచేసినది. ఫలములు పాలుగాక యాడింభకుండు మఱియేదియుఁ దినఁడు కావున నాయాహారమే చింతామణి పెట్టుచుండెను. ఆశిశువునకుఁ జింతామణియనియే నామకరణము జేసియున్నారు. వానినెప్పుడు బయటకురానీయక సంతతము లోపలనేయుంచి వాని యాటపాటల బంగారుమూటలవలె నెంచుచు మిక్కిలి సంతోషముతోఁ గాలము గడుపుచుండిరి. చింతామణియు నిత్యమువచ్చి వానిసంరక్షణ గనుం గొనుచుం బోవుచుండెను

ఆమాతంగునకుఁ బ్రయాగములో నెలకొకరాత్రి గస్తుదిరుగవలసినవంతుకలదు. ఆవంతునాఁడు వాఁడుగస్తుదిరుగనిచో నందులకై వానికిచ్చిన మాన్యము లాగికొందురు. కావున వాఁడేయూరికేగినను గస్తువంతునాఁడు తప్పక యూరిలోనుండితీరును.

ఒకనాఁడుఅగత్యమైన పనివచ్చినమాతంగు డూరికిఁబోయి గస్తువంతునాడు రాత్రికింటికి రావలయునని బయలుదేరెను దారిలో గంగానదిపొంగి వానిపయనమున కాటంకము గలుగఁజేసినది. కాలాతీతమగుటచే రేవుదాటించు నావయుం దొరికినదికాదు. మాన్యము పోవునని వాఁడుమిక్కిలి పరితపించుచు నవ్వలియొడ్డున బరుండెను.

ఇంటికడ మాతంగుభార్య మాలినియు దీపములు పెట్టువఱకు దనమగఁడు వచ్చుననునాసతోనుండి చీఁకటిపడినంత నిఁకరాడని నిశ్చ