పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

123

బుత్రుండనై యదయించితిని. ప్రాణోత్క్రమణసమయంబున బుద్ధి యెట్లుండునో యట్టి జన్మమే సంప్రాప్తించునని శాస్త్రములు చెప్పు చున్నవిగదా?

అని యాబాలుండు చింతామణి కుత్తరముచెప్పి కేరుమని యేడ్వఁ దొడంగెను అప్పుడది కన్నీరుగార్చుచుఁ దండ్రీ! వీండ్రపవిత్రులని పాలుగ్రోలుట మానితివా? అయ్యో! నిన్నీ శ్వపచునింటఁ బుట్టఁ జేసితి నేనెంత పాపాత్మురాలనో? విధికృతంబనతిక్రమణీయమని విచారించుచుండ మాతంగుఁడు అమ్మా ! వీఁడు బ్రతుకునా ? నీవుగూడ గన్నీరు విడుచుచుంటివేమి? నిజముజెప్పుము. దేవతలకు మీదుగట్టుము. తల్లీ ! వీనిభారము నీదని దానిపాదములంబడి వేడికొనియెను.

చింతామణి మాతంగా ! వీనికేమియుభయములేదు. మీశిశువునకుఁ దల్లిపాలుపడవు. ఆవుపాలు కావలయును నేనువోయి తీసికొనివత్తు వెఱవకుమనిపలికినవాఁడు తల్లీ! ఆవుపాలు మాయింటనే యున్నవి. త్రాగింపుమని గిన్నెతో నావుపాలు దెచ్చియిచ్చెను. దానింబోసినఁ ద్రాగఁడయ్యెను. అప్పుడా పుల్క సదంపతులు గోలుననేడ్చుచుండ వారించుచుఁ జింతామణి యాలోచించి తానొక బాహ్మణగృహంబున కరిగి యాచించి యావుపాలుతెచ్చి పోసిన నవ్వుచు నాబాలుండు గుటుగుగుటుగునఁ ద్రాగెను.

ఆయావుపాలె మఱునాఁడు పోసినఁ ద్రాగడయ్యే నప్పుడు చింతామణి గ్రహించి దినమునకొక విప్రగృహంబునకరిగి యాచించి తెచ్చి తానేస్వయముగాఁ బోయుచుండ గ్రోలుచుండెను మాతంగుఁ డా వారాంగన తనయందలి ప్రేమచే ననుదినమువచ్చి యాబాలున కుపచారములు సేయుచున్నదని తలంచి దానిం దల్లిగా గురువుగా దైవమునుగానెంచి స్తుతియింపుచుండును.

ఆబాలుండు దినదినాభివృద్ధి వడసి నవ్వుటయు దొర్లుటయు