పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వ్యాసమఠంబునకుఁబోయి యగ్నిశిఖునిగుఱించి వితర్కించిన నతండు పరమపదించినట్లు తెలిసినది.

అప్పుడప్పడఁతి మిక్కిలి పరితపించుచు నాహా ! నేను మహా పాపాత్మురాలను. మహానుభావుండైన యతీశ్వరునిఁ బుల్కసునియింట బుట్టఁజేసితిని నాప్రాజ్ఞత్వంబు గాల్పనా ? చీ చీ ! నేనొకమానిసినే. నన్నతం డవమానించెనని యీసుబూనితిని. కోపము పాపమునకుఁ బ్రాపుగాదే ప్రమాదము జరగినదని యనేకప్రకారములఁ బరితపించుచు తదుత్పత్తిప్రకారంబు దెలిసికొననెలలు లెక్క పెట్టుచుండెను.

ఒకనాఁడామాతంగుఁడు వాకిటనిలువంబడి చింతామణిగారూ! మాయాఁడుది బాధపడుచున్నది. వచ్చిచూడుఁడని కేకపెట్టెను ఆమాట విని యాఁబోటి సంభ్రమముతో నప్పుడే వానివెంట మాలపల్లెకరిగినది. అప్పటికామాలిని ప్రసవమై గడియయైనది. మగశిశువుగలిగెను పాలు త్రాగుటలేదని తల్లిదఃఖించుచున్నది.

చింతామణి మాలెతప్రక్కలోనున్న బాలకునెత్తికొని ముద్దాడుచు నాకారలక్షణంబులు పరీక్షించి యయ్యతియే యిట్లుపుట్టెనని నిశ్చయించి

చింతామణి - శ్లో॥ కస్త్వంబాలక ! బాలుఁడా! నీవెవ్వఁడవు?

శిశువు - బాలికె! యతిరహం, బాలామణీ ! నేను యతిని

చింతా – కస్మాదిదం జన్మతె, నీవిందేమిటికి జనించితివి ?

శిశువు - వక్ష్యేపూర్వము పానహౌ విధివశాత్ప్రాస్తోస్మిగృహ్ణన్ మఠం! ప్రాప్తోస్మీతిమతిం విధాయనితరాం సంత్యక్త దేహాస్మియ! చ్చండాలస్యసుతో స్మ్యహం తదబలె యాం తెమతిస్సాగతిః॥

చెప్పెదవినుము నేను బూర్వజన్మంబున వేసవిలో గంగనుండి మఠమునకుం బోవుచు చండాలుడుంచిన పాదుకలలోఁగాళ్లుంచి వానికి ఋణస్థుండనైతినని తలంచుచు దేహమును విడిచితి దానంజేసి వానికిఁ